దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో భయాందోళనకు గురవుతుంటే.. తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా అంటే ఔననే వార్తలు వినిపిస్తున్నాయి.
గత మూడు, నాలుగు రోజుల నుంచి దేశంలో కరోనా, ఓమిక్రాన్ కేసుల భారీగా పెరుగుతున్నాయి. అనూహ్యంగా ఈ కేసులు సంఖ్య పెరగడం థర్డ్ వేవ్ కు సంకేతమని కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ ఎన్ కే అరోరా అన్నారు. గత రెండు మూడు రోజుల నుంచి దేశంలో రోజు వారి కరోనా కేసులు అనూహ్యంగా నమోదయ్యాయి. ఇది దేశంలో థర్డ్ వేవ్ సాంకేతం అని తెలిపారు. ముఖ్యంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఆయన అన్నారు.
ఇది చదవండి : అరుదైన ఘటన.. రెండు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు..!
గత నెల డిసెంబర్ మొదటివారంతో పోలిస్తే చివరి వారం ఓమిక్రాన్ కేసుల సంఖ్య రెట్టింపు అయిందని అరోరా తెలిపారు. దేశంలో కోవిడ్ కేసుల్లో 28 శాతం పెరుగుదల నమోదైందని తెలుస్తోంది. ముఖ్యంగా మెట్రోనగరాలైన ఢిల్లీ, కోల్ కతా, ముంబై లలోనే 75 శాతం కేసులు నమోదవుతున్నాయని అరోరా అన్నారు.