కరోనా.. ఈ మూడు అక్షరాలు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకి ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా విధంగా నష్టపోతూనే ఉన్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన మరణ హోమం మరవక ముందే.. థర్డ్ వేవ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే భవిష్యత్ భయానకంగా కనిపిస్తోంది అంటూ అప్పుడే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ కి ముందుగానే ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1) ఇప్పటికీ మీలో ఎవరైనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోనట్లైతే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోండి. ఏ వ్యాక్సిన్ అయినా సరే.. రెండు డోస్ లను పూర్తి చేసుకోండి. థర్డ్ వేవ్ సమయానికి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే మీరు కొంత వరకు సేఫ్ గా ఉన్నట్టే లెక్క.
2) సెకండ్ వేవ్ చివరి దశలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ ప్రకటించాయి. దీంతో.., అవసరం ఉన్న వారు, లేనివారు యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చేశారు. ఇప్పుడు కూడా ఇలానే రోడ్లపైకి రాకుండా.., షాపింగ్స్, ఔటింగ్స్ లాంటివి సరదా కోసం మాత్రం ప్లాన్ చేసుకోకండి.
3) అన్ లాక్ నడుస్తోంది కదా అని ఏమైనా శుభకార్యాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారా? దయచేసి ఆ ప్లాన్స్ మార్చుకోండి. కార్యక్రమం ఏదైనా తక్కువ మందితో ముగించేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు సూపర్ స్ప్రెడర్స్ మారకండి.
4) ముఖ్యంగా థర్డ్ విషయంలో అపోహలకు దూరంగా ఉండండి. కరోనా ఏ వయసు వారిని పర్టికులర్ గా టార్గెట్ చేయదు. కాబట్టి మీ పిల్లల విషయంలో అతిగా భయపడవద్దు. జాగ్రత్తలు మాత్రం పాటించండి చాలు.
5) సరైన ఆహరం తీసుకోవడం, అందుకు తగ్గ వ్యాయామం చేయడం ఎప్పుడూ మంచిదే. కాబట్టి..ఇమ్యూనిటీ విషయంలో కాస్త జగరత్తగా ఉండండి.