Snake: ‘పాము’ అని ఎవరైనా గట్టిగా అరవగానే మన ఒళ్లు జలదరిస్తుంది. అదే పాము మన పక్కన కనబడితే భయంతో గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. అలాంటిది పాము కరిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుంది? భయంతోనే సగం ప్రాణాలు పోతాయి. ఇదంతా సాధారణ మనుషులకు సంబంధించిన విషయం.. కానీ, కొంతమంది ఉంటారు. తమను కాటేసిన పాము మీదే ప్రతీకారం తీర్చుకుంటారు. కొట్టి చంపి మాత్రం కాదు.. కొరికి చంపి. అవును! ఇది వినడానికి వింతగా ఉన్నా నిజం. ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి తనను కాటేసిన పాముపై తన దైన స్టైల్లో ప్రతీకారం తీర్చుకున్నాడు. దాన్ని కొరికి చంపి మెడలో వేసుకుని తిరిగాడు.
ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా, బాలసోరె జిల్లాలోని దారాడ గ్రామానికి చెందిన సలీమ్ తాంత్రిక్ మంగళవారం తన పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఓ పాము అతడి దగ్గరకు వచ్చింది. కాలుపై కాటేసింది. అయితే, పాము కరవగానే అతడు భయపడిపోలేదు. వెంటనే దాన్ని దొరకబట్టుకున్నాడు. ‘‘నన్నే కాటేస్తావా? నిన్ను ఏం చేస్తాను చూడు’’ అని కసిగా అన్నాడు. పామును ఇష్టం వచ్చినట్లు కొరికాడు. అది అతడి ధాటికి ప్రాణాలు విడిచింది. కానీ, సలీమ్ అంతటితో దాన్ని వదల్లేదు. మెడలో హారంలాగా వేసుకున్నాడు. అలాగే ఊర్లోకి వచ్చాడు.
ఇది చూసిన కొంతమంది జనం జడుసుకున్నారు. మరికొంతమంది ‘నువ్వు గ్రేట్ బాబు’ అని అనటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ వాడు మగాడ్రా బుజ్జీ’’.. ‘‘పాము కాటేసిందని తెలియగానే కొంతమంది గుండె ఆగి ఛస్తారు. కానీ, అతడు చాలా గ్రేట్’’..‘‘ పాము మీదే రివేంజ్ తీర్చుకున్న రివేంజ్ మాస్టర్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: Amit Shah Mumbai Security: అమిత్ షా సెక్యూరిటీ టీమ్ లో ఏపీకి చెందిన ఆగంతకుడు.. ఫేక్ ఐడీతో టీమ్ లో చేరి..