లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ.. దేశం విడిచి పారిపోయిన గురువు నిత్యానంద గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త తెగ ప్రచారం అవుతుంది. అదేంటంటే.. ఆయన మరణించాడని. భారత దేశం నుంచి వెళ్లిపోయిన నిత్యానంద విదేశాల్లోనే కన్నుమూశాడనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ వార్తలపై నిత్యానంద స్పందించాడు. తాను బతికే ఉన్నానని.. కొన్ని రోజుల క్రితమే సమాధిలోకి వెళ్లి వచ్చానని తెలిపాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ కూడా చేశాడు.
‘‘కొన్ని రోజులుగా నేను అనారోగ్యంతో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. నా భక్తులు ఎవరు వాటిని నమ్మవద్దు. నేను చనిపోలేదు. సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం సమాధిలో నుంచే నా జవాబు ఇస్తున్నాను. నేను మరణించినట్లు కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. కానీ అవి నిజం కావు. సమాధిలోకి వెళ్లి వచ్చిన నేను.. ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేను. మనుషులు, ప్రాంతాల పేర్లను మర్చిపోయాను. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతం నాకు 27 మంది వైద్యులు వైద్యం చేస్తున్నారు. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తాను’’ అంటూ లెటర్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. కాగా భారత్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద.. 50 సార్లు కోర్టుకు కూడా హాజరయ్యాడు. చివరకు 2019లో భారత్ వదిలి పారిపోయాడు. ప్రసుత్తం ఈక్వెడార్‌కు సమీపంలో ఓ ద్వీపంలో ఉంటున్నాడు. నిత్యానంద చేసిన పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.