భారత దేశంలో ప్రపంచంలోని అన్ని దేశాలకంటే విభిన్నమైనది. ఇక్కడ అనేక రకాల కుల, మత, జాతుల వారు అన్నాదమ్ముల వలే కలిసి జీవిస్తుంటారు. అలానే మతసామరస్యానికి ప్రతీకగా అనేక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్.. ఇలా అనేక మతాల వారు మరొక మతవారి వేడుకల్లో పాల్గొన్ని మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంటారు. అందుకు నిదర్శనంగా ఇప్పటికే అనేక ఘటనలను మనం చూశాం. అమ్మవారికి పట్టుచీరను అందించిన ముస్లిం కుటుంబం, అలానే ముస్లిం వేడుకల్లో హిందూవులు పాల్గొనడం వంటివి అనేకం జరిగాయి. తాజాగా మతసామరస్యానికి ప్రతీకగా మరో ఘటన నిలిచింది. ఓ ముస్లిం నేత.. 30 జంటలకు హిందూ సంప్రదాయంలో వివాహం జరిపించారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక కొప్పాల్ లోని వాజిర్ అలీ హోనల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భారతీయుడిని అనే భావన తప్పా.. కులం, మతం అనే విధానంతో అసలు నచ్చదు. కుల, మతాలకు అతీతంగా జీవిచండమే తన అభిమతమని నమ్మిన వాడు. అన్ని మతాల వారిని తన వారిగానే చూసుకుంటాడు. ఈక్రమంలో ఆయన మతసామరస్యానికి ప్రతీకగా ఓ మంచి కార్యక్రమం చేశాడు. కొప్పాల్ ప్రాంతంలోని బన్నీ మహంకాళి ఆలయంలో బుధవారం హిందూ సాంప్రదాయాల ప్రకారం బుధవారం వివిధ వర్గాలకు చెందిన జంటలకు వివాహం జరిపించాడు. ఈ వేడుకలో వివిధ కులాలు చెందిన మొత్తం 30 హిందు జంటలు ఒక్కటయ్యాయి. కార్తీక మహోత్సవాల్లో భాగంగా కాళీమాత ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. గతంలోనూ ఇదే ఆలయంలో ఆయన కొన్ని వందల జంటలకు వివాహం జరిపించి.. ఒక్కటి చేశారు. ఇలా పదుల సంఖ్యలో జంటలకు వివాహాలు జరిపించి ఆయన ఎంతో మందికి ఆదర్శంప్రాయంగా నిలుస్తున్నారు.