హోలీ పండుగను ఇష్టపడని వారు ఉంటారా? ఈ పండుగ కోసం ఎదురు చేసే వాళ్లు కూడా ఉంటారు అంటే నమ్ముతారా? ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఊర్లోని మహిళలు మాత్రం ఏ పండుగను జరుపుకోనంత సందడిగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకు కారణం.. అక్కడ మగవాళ్లు హోలీ ఆడకూడదు. ఇదేం ఆచారం? చాలా గ్రామాల్లో మహిళలను ఆడనివ్వరుగా కదా అని మీరు అనుకోవచ్చు. మరి.. ఈ వింత ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర ప్రదేశ్ లోని హరీమ్‌పూర్ జిల్లా కుందౌరా అనే ఓ చిన్న గ్రామం ఉంది. అది చిన్నది ఊరు కావడంతో అక్కడ జనాభా కూడా తక్కువే. మహా అంటే ఓ 5వేల మంది అక్కడ నివసిస్తూ ఉంటారు. దీంతో ఊర్లో వాళ్లు వాళ్లకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు అందులో ఒకటి హోలీ పండుగ. అక్కడ హోలీ పండుగ మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు పురుషులు రంగులు చల్లుకుంటూ హోలీ ఆడతారు. రెండో రోజు కన్నెపిల్లలు, మహిళలు మాత్రమే హోలి ఆడతారు. ఆ రోజు వారికి నచ్చిన దుస్తుల్లో ఆరు బయట హోలీ ఆడవచ్చు.
అత్తాకోడళ్లు సైతం ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు వేస్తారు. ఈ మూడు రోజుల్లో రెండు రోజులు పురుషులు ఇళ్లల్లోనే కూర్చోవాలి. కాదని బయటకు వస్తే ఆడవాళ్ల బట్టలు వేసి రంగులు చల్లుతారు. అందుకే ఇంటికి అయినా పరిమితం అవ్వాలి లేదా ఊరి నుంచి ఆ రెండ్రోజుల పాటు బయటకు వెళ్లాలి. కాదని పురుషులు బయటకు వచ్చారో.. వారికి లెహంగా చోళీ వేసి రంగులు చల్లుతారు. కొన్ని సందర్భాల్లో ఊరంతా ఊరేగించి కొడుతుంటారు కూడా.
ఇక మూడో రోజు హోలీ పండుగను రామ్ జానకి గుడి ఆవరణలో నిర్వహిస్తారు. అర్ధరాత్రి వరకు జరిగే ఈ సంబరాల్లో మహిళలు డోలు, కంజిరాలు వాయిస్తూ నృత్యం చేస్తారు. కొంతమంది మహిళలంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఆకర్షణీయంగా కనిపిస్తారు. సాయంత్రం కాగానే ప్రత్యేకమైన వంటకాలను తయారు చేసి ఇంట్లో పురుషులకు వడ్డిస్తారు. ఇక్కడ కూడా ఫోటోలు, వీడియోలు తీయకూడదు.మరి.. ఈ వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.