ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్… ఇక నుంచి వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. మణిపూర్ సీఎంగా రెండో సారి బాధ్యతలను స్వీకరించిన బీరెన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారు వారానికి ఐదు రోజులు వరకు పనిదినాలు ఉండేలా కొత్త జీవో రిలీజ్ చేశారు. ఇక నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారు. అంటే ఇక ముందు ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిచేస్తాయి. ఈ నోటిఫికేషన్ ని ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సునంద తోక్‌చోమ్ రిలీజ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమకు కల్పించిన వసతిని సద్వినియోగం చేసుకొని సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపారు. అయితే ఈ నిర్ణయం ఒక్క వెకేషన్ డిపార్ట్‌మెంట్ మినహా అన్ని ఆఫీసులకు వర్తించే విధంగా ఉండబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇక నుంచి వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి : ప్రయాణికులకు ఆర్టీసీ మరో షాక్!