మణిపూర్ లో హింసకు ఆజ్యం పోసింది.. కుకీ మహిళలపై అత్యాచారం జరగడానికి కారణం ఎవరో సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులు వెల్లడించారు. వాళ్ళని అలా అమ్మాయిలపై దాడి చేసేలా ప్రేరేపించిన వాళ్ళు వేరే ఉన్నారని అన్నారు.
మణిపూర్ లో రెండు నెలల కింద మొదలైన హింసకు కారణం ఏంటో పలు సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులు వెల్లడించారు. కుకీ వర్గానికి చెందిన మహిళను మెయిటీ వర్గం వారు అత్యాచారం చేశారని.. ఈ వర్గానికి చెందిన వారు కుకీ వర్గానికి చెందిన వారిపై దాడికి పాల్పడ్డారు. అమ్మాయిలను ఎత్తుకెళ్ళి మరీ వివస్త్రలను చేసి ఊరేగించారు. ఆపై అత్యాచారం చేశారు. అడ్డొచ్చిన తండ్రీ, కొడుకులను హతమార్చారు. ఈ దారుణాన్ని చూసిన తర్వాత ఆ నీచులను ఉరి తీయాలని దేశ ప్రజలంతా కోరుతున్నారు. అయితే వీళ్ళని ఇలా చేయమని ప్రేరేపించిన వాళ్ళు మరొకరు ఉన్నారు. ఈ విషయాన్ని మణిపూర్ లోని భద్రతను పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులే వెల్లడించారు. అవును మణిపూర్ హింసకు ఆజ్యం పోసిన అసలు నేరస్థులు వేరే ఉన్నారు.
రూమర్లు, ఫేక్ న్యూస్ మణిపూర్ హింసకు ఆజ్యం పోశాయని అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పలు సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులు వెల్లడించారు. ఫేక్ న్యూస్ కారణంగా మణిపూర్ లో మొదట అల్లర్లు చెలరేగాయని స్పష్టం చేశారు. మెయితీ వర్గానికి చెందిన మహిళను అత్యాచారం చేశారంటూ ఒక ఫేక్ ఫోటో ప్రచారం చేయడంతో ఆ వర్గం ప్రజలు రెచ్చిపోయారని సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. ఆ ఫేక్ ఫోటో అత్యాచారం నిజం అనుకుని.. మే 4న ఇద్దరు కుకీ మహిళలపై మెయిటీ వర్గానికి చెందిన వాళ్ళు అత్యాచారం చేశారని అన్నారు. మే 3న ఇంఫాల్ లో దొరికిన మృతదేహం ఢిల్లీ మహిళదని.. కానీ అది మెయిటీ వర్గానికి చెందిన మహిళగా ప్రచారం చేయడంతో అల్లర్లకు ఆజ్యం పోసినట్లయిందని అధికారులు వెల్లడించారు.
ఫేక్ న్యూస్ కారణంగానే మొదట అల్లర్లు మొదలయ్యాయని అధికారులు స్పష్టం చేశారు. మే 3వ తేదీన పాలిథిన్ కవర్ లో చుట్టి ఉన్న ఓ మహిళ మృతదేహం ఇంఫాల్ లోయలో దిరికింది. దీన్ని అక్కడి స్థానిక ఛానల్స్ అన్నీ మరోలా ప్రసారం చేశాయి. చురాచాంద్ పూర్ లో కుకీ వర్గానికి చెందిన కొందరు మెయిటీ వర్గానికి చెందిన మహిళను అత్యాచారం చేసి హత్య చేశారని.. ఆ తర్వాత మృతదేహాన్ని పాలిథిన్ కవర్ లో చుట్టి ఇంఫాల్ లోయలో పడేశారని నకిలీ వార్తను వ్యాప్తి చేశారు. ఇది నిజమని నమ్మిన మెయిటీ వర్గ ప్రజలు కుకీ వర్గంపై దాడికి దిగారని.. ఆపై ఇద్దరు మహిళలను అపహరించి వివస్త్రలను చేసి ఊరేగించి అత్యాచారం చేశారని అధికారులు వెల్లడించారు.
వాస్తవానికి చురాచాంద్ పూర్ లో మీడియా ప్రచారం చేసిన యువతి మృతదేహం మెయిటీ వర్గానికి చెందిన అమ్మాయిది కాదు. మయన్మార్ లో జరిగితే మణిపూర్ లో జరిగిందంటూ ఫేక్ వార్త ప్రచారం చేశారు. కొందరు గిరిజనులు మతపరమైన స్థలాన్ని తగలబెడుతున్నట్లు ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయగా.. పోలీసులు సంబంధిత వర్గం వారిని అక్కడకు తీసుకెళ్లి ఫేక్ అని తేల్చారు. కొందరి మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. అందులో ఓ మహిళది కూడా ఉంది. అయితే ఆ మహిళను మణిపూర్ లోని గిరిజనులే నరికేశారని 26 సెకన్ల వీడియోని వైరల్ చేశారు. కానీ ఆ వీడియో గత ఏడాది మయన్మార్ లోని టమూ పట్టణంలో హత్యకు గురైన మహిళదని అధికారులు వెల్లడించారు.
అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో వేధింపులకు గురవుతున్న వీడియోని ఇంఫాల్ లో జరిగిందని ఫేక్ న్యూస్ వ్యాప్తి చేశారు. దీన్ని మణిపూర్ లోని స్థానిక ఛానల్స్, వార్తాపత్రికలు ప్రచారం చేసి అల్లర్లకు ఆజ్యం పోశాయని.. మే 3 నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు వెల్లడించారు. ఏకపక్షంగా వార్తలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం వల్లే ఇంత దారుణం జరిగిందని అన్నారు. ఫేక్ న్యూస్ వల్ల కుకీ వర్గానికి చెందిన మహిళలపై మెయిటీ వర్గానికి చెందినవారు అత్యాచారం చేశారని.. ఈ పాపంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన మీడియా, వార్తాపత్రికలు, నెటిజన్ల భాగస్వామ్యం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.