ఇప్పుడిప్పుడే మహిళలు సాధికారిత దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ.. సంపాదనలో భర్తకు చేదోడు వాదోడుగా.. ఇంటికి ఆసరాగా నిలుస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగానికి వెళ్లాలంటే ఆడవాళ్లు బయపడే రోజులు వస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే మహిళలు సాధికారిత దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ.. సంపాదనలో భర్తకు చేదోడు వాదోడుగా.. ఇంటికి ఆసరాగా నిలుస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగానికి వెళ్లాలంటే ఆడవాళ్లు బయపడే రోజులు వస్తున్నాయి. ఉన్నతోద్యోగుల వేధింపులు తట్టుకోలేక.. ఉద్యోగాలకు వెళ్లడం లేదు చాలా మంది మహిళలు. భర్తకు చెప్పినా అర్థం చేసుకోకపోవడమే.. ఈ సమస్యల వల్ల కుటుంబ కలహాలు ఏర్పతాయన్న భావం వల్లో తెలియదు కానీ దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆడదంటే ఆడదానికి శత్రువు అన్న సామెతను నిజం చేస్తూ తోటి మహిళలే.. సాటి మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడటం విచారకరం.
దీనికి సాధారణ మహిళలే కాదూ ఓ స్థాయి ఉద్యోగులు కూడా బలౌతున్నారు. వేధింపుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగి లతా మోహన్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని మధుగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేదరహట్టి నివాసి అయిన35 ఏళ్ల లతా మోహన్ తాలూకా కార్యాలయంలో15 ఏళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవల కాలంలో అక్కడ ప్రభుత్వం మారడంతో కొంత పని ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు.. గ్రేడ్–2 తహసీల్దార్ జయలక్ష్మమ్మ వేధింపులు తాళలేక మదనపడుతూ భర్తకు చెప్పలేక.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త గమనించి ఆసుపత్రి తీసుకెళ్లే లోపు చనిపోయిందని వైద్యులు నిర్దారించారు. తాలూకా కార్యాలయం ముందు సంతాప సభను ఏర్పాటు చేసి ఆమెకు నివాళులర్పించారు. అలాగే జయలక్షమ్మపై తాశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తమ మధ్య ఎటువంటి సమస్యలు లేవని, పని ఒత్తిడి ఉన్నట్లు చెప్పిందని భర్త ఫిర్యాదు చేశారు.