ఓ వ్యక్తి చేసిన పని.. తన భార్యపై ఇంత ప్రేమ ఉందా? అనేలా చేసింది. తన భార్యకు దోమలు కుడుతున్నాయని, ఎవరైనా కాస్త సాయం చేయండంటూ ట్వీట్ చేశారు. అతడి ట్వీట్ కు పోలీసులు స్పందించారు
పెళ్లి అనేద బంధంతో రెండ మనస్సులు కలిసి ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి.. పెళ్లి అనే బంధంతో రెండు మనస్సులు ఒకటవుతాయి. అలానే తమకు తెలియకుండానే ఒకరిపై మరొకరికి ప్రేమానురాగాలు ఏర్పడతాయి. భాగస్వామిని.. తన బంధువులు ఏమన్నా కూడా సహించరు. ఇలా భార్యాభర్తలు పరస్పరం ప్రేమానురాగాలు పంచుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని.. తన భార్యపై ఇంత ప్రేమ ఉందా అనేలా చేసింది. ‘నా భార్యకు దోమలు కుడుతున్నాయి.. ఎవరైన కాస్త సాయం చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. అతడి ట్వీట్ కు పోలీసులు స్పందించారు. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం సంభల్ జిల్లాకు చెందిన అసద్ ఖాన్ అనే వ్యక్తి భార్యకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను సమీపంలోని చందౌసి పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో చేర్చాడు. అదే రోజు రాత్రి.. ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అసద్ ఖాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ నర్సింగ్ హోమ్ లో దోమలు విపరీతంగా ఉన్నాయి. అవి.. అసద్ ఖాన్ భార్యను, కుమార్తెను తీవ్రంగా కుడుతున్నాయి.
దీంతో ఆ పసిపాప ఏడవడం ప్రారంభించింది. అలా దోమలు కుట్టడం వలన భార్య పడుతున్న ఇబ్బందిని, తన బిడ్డ ఏడుపును అసద్ ఖాన్ చూడలేక పోయాడు. వెంటనే మస్కిటో కిల్లర్ కోసం అతడు బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి కావడంతో షాపులు మూసి ఉన్నాయి. ఇక చేసేది లేక తిరిగి నర్సింగ్ హోమ్ లోకి వెళ్లాడు. అక్కడ తన భార్య, కుమార్తె పడుతున్న బాధను చూడలేకపోయాడు. యూపీ పోలీసులకు ఓ ట్వీట్ చేశాడు. ” నా భార్య, బిడ్డకు దోమలు కుడుతున్నాయి. దయచేసి కాస్త సాయం చేయండి” అంటూ యూపీ పోలీసులకు ట్వీట్ చేశాడు. దానికి సంభల్ పోలీసులకు, డయల్ -112 ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేశాడు. అయితే సంభల్ పోలీసులు కూడా ఈ మానవీయ కోణంలో స్పందించారు.
వెంటనే అసద్ ఖాన్ ట్వీట్ కు రిప్లయ్ ఇచ్చారు. అలానే కొద్దిక్షణాల్లోనే ఆసద్ ఖాన్ ఉన్న నర్సింగ్ హోమ్ కు వచ్చి… మస్కిటో కిల్లర్ ను అందించారు. అంతేకాక.. మాఫియా నుంచి మస్కీటో వరకు దేన్నైనా ఎదుర్కొంటామంటూ పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పోలీసులు చేసిన సహాయానికి అసద్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. యూపీ పోలీసులు చేసిన ఈ మంచి పనికి నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం అసద్ ఖాన్ చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి. .యూపీ పోలీసులు స్పందించిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి