కేరళలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి బావిలో పడి చిక్కుకుపోయాడు. శనివారం నుండి ఆ కూలీ బావిలోనే ఉండిపోయాడు. ఆ వ్యక్తిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
జీవనోపాధి కోసం చాలామంది వారి సొంత ఊరును, తమ కుటుంబాన్ని వదులుకుని వచ్చి పనులు చేసుకుంటుంటరు. అలాగే వారు పనులు చేసే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వారి యజమానితో సంప్రదింపులు జరుపుతారు. పొట్టకూటికోసం ఒక్కరు ఒక్కోపని చేస్తుంటారు. కొందరైతే పనుల కోసం రాష్ట్రాలను దాటి కూడా వెళుతుంటారు. పనులు చేసే క్రమంలో అనుకోని ప్రమాదాలు చాలా జరుగుతాయి. వాటిల్లో తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. అలాంటి సంఘటనే కేరళలో జరిగింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఓ వ్యక్తి పనులు చేసుకుంటూ ఉండేవాడు. అతని పేరు మహరాజన్.. అతనికి దాదాపు 55 ఏళ్ల వయసు ఉంటుంది. పనులు చేస్తున్న క్రమంలో అనుకోకుండా ఓ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం..
కేరళ రాజధాని తిరువనంతపురంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి బావిలో పడిపోయాడు. అతని పేరు మహరాజన్.. అతడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను బావిలో పైపులు దింపే పనికి వెళ్లాడు. పైపులు బావిలోకి దింపే క్రమంలో.. మట్టిపెళ్లలు కూలి అతనిపై పడ్డాయి. అనుకోకుండా దాదాపు 100 అడుగుల లోతులో పడిపోయాడు. కూలిన మట్టిలోనే ఇరుక్కుపోయాడు. రాత్రంతా అధికారులు అతన్ని బయటకు తీసేందుకు అధికారులు నిర్విరామంగా చర్యలు చేపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ వ్యక్తిని బయటికి తీయడం సాధ్యం కాలేదు. నిన్నటి నుండి బావిలోనే చిక్కుకుని ఉండిపోయాడు.
శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు అందిస్తున్నారు. అధునాతన పరికరాలను తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. అతను తమిళనాడుకు చెందిన వ్యక్తి అయిన్పటికీ.. చాలా సంవత్సరాలుగా అతడు విళింజం ప్రాంతంలోనే నివాసం ఉంటున్నట్లు అధికారులు వెల్లడించారు.