దేశ ప్రజలకి షాకిస్తూ రూ. 2 వేల నోటును ఉప సంహరింటుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నోటు పుణ్యమా అని కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి
దేశ ప్రజలకి షాకిస్తూ రూ. 2 వేల నోటును ఉపసంహరింటుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30వ వరకు ఈ నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చంటూ ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయలు నోట్లను మార్చుకునేందుకు ఆపసోపలు పడుతున్నారు. బ్యాంకుల్లో మార్చుకోవాలంటే క్యూలైన్, కేవైసీ అంటూ గంటల సమయం పడుతున్న తరుణంలో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నోటు పుణ్యమా అని కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఓ వాహనదారుడు పెట్రోల్ బంక్ వద్ద వెళ్లి తన బైక్ లో పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం అక్కడి సిబ్బందికి తన వద్ద ఉన్న రూ. 2 వేల నోటు ఇచ్చాడు. అయితే ఆ సిబ్బంది రెండు వేల రూపాయల నోటు తీసుకునేందుకు నిరాకరించాడు. అంతేకాక ఆ నోటు వద్దని మరో నోటు ఇవ్వాలంటూ కోరాడు. వాహనదారుడు తన వద్ద రూ.2000 నోటు మాత్రమే ఉందని తెలిపాడు.
దీంతో ఆ సిబ్బంది.. స్కూటీలో నింపిన పెట్రోల్‌ను తీసుకుంటానని వాహనదారుడిని హెచ్చరించాడు. అయితే అలా కేవలం మాటల్లోనే కాకుండా నిజంగానే స్కూటీలోని పెట్రోల్ ను పైపు సహాయంతో బయటకు తీశాడు. దీంతో సదరు వాహనదారుడు షాకి గురయ్యాడు. ఏంది రా సామీ..ఈ దారుణం అంటూ వాహనదారుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కూకుండా పలు రాష్ట్రాల్లో కొందరు వ్యాపారులు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు.
కొందరు బంగారం కొనుగోలు, షాపులో వస్తువుల కొనుగోలు ద్వారా 2 వేల నోటు మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు కూడ ప్రజల నుంచి రూ. 2 వేల నోటును స్వీకరించేందుకు ససేమిరా అంటున్నారు. ఇంకొందరైతే రూ.2 వేల నోటును తిరిగి ఇచ్చేసి తమ వస్తువులను మళ్లీ వెనక్కి కూడా తీసుకుంటున్నారు. మరి.. యూపీలో జరిగిన విచిత్ర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.