సాధారణంగా పెద్దలు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటూ ఉంటారు. నిజంగానే కంటి చూపు లేకుండా ఊహించుకోవడం ఎంతో కష్టం అంటుంటారు. మన అవయవాల్లో నేత్రాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కొంత మంది పుట్టుకుతోనే కంటిచూపు కోల్పోతుంటారు. కంటిచూపు లేకుండా జన్మించడం అంటే ఎంత నరకమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొన్నిసార్లు ప్రమాదాల వల్ల కంటిచూపు కోల్పోయిన వారు ఉంటారు.
దేశంలో కొంత మంది ఒకే ఒక కంటితో కూడా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందుల వల్ల అలా జరుగుతుంది. అలాంటి జాబితాలోకి వస్తారు బంగాల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న పార్థ భట్టాచార్య. అయితే తాను 54 ఏళ్ల తర్వాత తన కంటిచూపును పొందానని తెగ సంతోషంలో మునిగిపోతున్నాడు. వివరాల్లోకి వెళితే..
ఇది చదవండి: Gujarat: ఇదెక్కడి చోద్యం.. తనని తానే వివాహం చేసుకోబోతున్న యువతి!
జల్పాయ్గుడి జిల్లాకు చెందిన పార్థ భట్టాచార్య తన ఏడవ క్లాస్ లో కుడి కంటికి సమస్య వచ్చిందని.. ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకుతో చెప్పడంతో వారు దగ్గరలోని కంటి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. భట్టాచార్యకు కుడి కంటిలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. అతడు భవిష్యత్ లో పూర్తిగా చూడలేడని తెలిపాడు. భట్టాచార్యది నిరుపేద కుటుంబం కావడంతో అతడు నూనె దీపాల వెలుతురులో చదువుకునే వాడు. దాని నుంచి వచ్చే పొగ ఆ వెలుతురు అతని కంటిపై ప్రభావం చూపింది.
తన కంటి సమస్యకు పరిష్కారం కోసం భట్టాచార్య దేశవ్యాప్తంగా పలువురు వైద్యులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. కొంత మంది నేపాల్ లో కంటి చికిత్స బాగా చేస్తారని తెలుసుకున్నాడు.. అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో భట్టా చార్య శిలిగుడిలోని గ్రేటర్ లయన్స్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ డాక్టర్ క్వాజీ ఆలం నయ్యర్‌ను కలిశారు.భట్టాచార్య కళ్లను బాగా పరీక్షించిన డాక్టర్ ఆపరేషన్ చేస్తే కంటి చూపు వస్తుందని భరోసా ఇచ్చాడు. ఈ క్రమంలో ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశారు. మొత్తానికి తన కంటిచూపును మళ్లీ పొందాడు భట్టాచార్య.
ఇది చదవండి: Hyderabad: డప్పు కొడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్!
ఈ సందర్భంగా జర్నలిస్టు భట్టాచార్య మాట్లాడుతూ.. ఇదో అద్భుతం.. దేశంలో ఎన్నో కంటి ఆసుపత్రులకు వెళ్లాను కానీ ఎక్కడ కూడా నాకు నయం కాదని తేల్చి చెప్పారు. దీంతో నా జీవితంలో వెలుగు చూడలేనని ఎంతో బాధపడ్డాను. స్నేహితుల ద్వారా గ్రేటర్ లయన్స్ గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లాను.. కంటి పరీక్షలు చేసిన డాక్టర్ ఖ్వాజీ ఆలం నయ్యర్ నాకు కంటి చూపు తప్పకుండా వస్తుందని అన్నారు. ఆయన చేసిన వాగ్ధానం నిలుపుకున్నారు.. నాకు కంటి చూపు ప్రసాదించాడు. ప్రస్తుతం నా కుడి కన్నుతో నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది” అని భట్టాచార్య చెప్పారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.