ఈ మద్య సినీ, రాజకీయ రంగాల్లో పలు విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమకు ఎంతో ఇష్టమైన నటులు, నేతలు అస్వస్థతకు లోనై ఆస్పత్రిపాలు కావడంతో కుటుంబ సభ్యులే కాదు అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వెండితెరపై స్టార్ హీరోలుగా వెలిగిన వారు తర్వాత సొంత పార్టీలు పెట్టి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవారు ఉన్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్, ఏంజీఆర్ లాంటి వారి సొంత పార్టీ స్థాపించి రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇదిలా ఉంటే ఈ మద్య సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు కన్నమూయడం, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి, బెంగాళీ నటుడు బాబుల్ సుప్రియో సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే ఆయనను కోల్‌కతాలోని ఓ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. వివరాల్లోకి వెళితే..
ప్రశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర మంత్రి, ఒకప్పుటి బెంగాల్ నటుడు బాబుల్ సుప్రియోకి సోమవారం తీవ్రంగా ఛాతి నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన కోల్ కొతాలోని వుడ్‌ల్యాండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరలించగా వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాబుల్ సుప్రియో గుండె రక్తనాళాల పనితీరు ఎలా ఉందన్న విషయం తెలుసుకునేందుకు యాంజీయోగ్రామ్ చేశారు. ఆయనకు మైనర్ కరోనరీ ఆర్టరీ అనే ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందించామని.. బాబుల్ సుప్రియో ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.
బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పారా అనే ఒక చిన్న గ్రామంలో జన్మించారు. సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించిన ఆయన మొదటి నుంచి సంగీతం పై ఎక్కువ శ్రద్ద చూపించారు. పూర్తి స్థాయిలో ఆయన సింగర్ కాకముందు బ్యాంక్ లో పనిచేశారు. అమితాబచ్చన్, ఆశాబోంస్లే లాంటి వారితో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్లే బ్యాక్ సింగర్, నటుడు, టీవీ వ్యాఖ్యతాగా ప్రజల్లో గొప్ప అభిమానం సంపాదించుకున్న బాబుల్ సుప్రియో భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు… అంతేకాదు అతి పిన్న వయసులో మంత్రి అయ్యారు. ఆయన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.