సాధారణంగా కొంతమంది గ్రామాల్లో అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలను ఇండ్లలోనే ఏర్పాటు చేసి నడిపిస్తుంటారు. అవి కొన్నిసార్లు ప్రమాదాలకు గురై ఎంతోమంది అమాయకులు చనిపోతుంటారు.
ప్రమాదాలు ఎటు నుంచి ఎలా వస్తాయో తెలియదు. ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది కన్నుమూస్తున్నారు. కొన్నిచోట్ల గ్యాస్ ఫ్యాక్టరీల్లో ప్రమాదాల వల్ల కార్మికులు చనిపోతున్నారు. సాధారణంగా అక్రమ బాణాసంచా కర్మాగారాల్లో ప్రమాదాలు సంభవిస్తుంటాయి.. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతుంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్ విషాదం చోటు చేసుకుంది. మిడ్నాపూర్ లోని ఎగ్రా లో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది ప్రాణాలో కోల్పోయారు. ఎగ్రాలోని సహారా ప్రాంతంలోని గోపీనాథ్ పూర్ చంద్ కురి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా కర్మాగారంలో ఈ ఘటన జరిగింది. కర్మాగారంలో పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాకప సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ సంఘటనపై సీఐడీ విచారణ జరుపుతుందని స్థానిక ఎస్పీ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్‌లోని ఎగ్రాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎగ్రాలోని సహారా ప్రాంతంలోని గోపీనాథ్‌పూర్ చంద్‌కూరి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా కర్మాగారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి పలువురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ జరుపుతుందని స్థానిక ఎస్పీ తెలిపారు.
బాధితులు నివాస భవనంలో అక్రమంగా బాణాసంచా తయారీ కొనసాగిస్తున్నారని.. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న చెరువులతో సహా శరీర భాగాలు, శిథిలమైన ఇల్లు.. ఘటనా స్థలం మొత్తం భీతావాహనంగా మిరపోయిందని గ్రామస్థులు తెలిపారు. పేలుడు ధాటికి మొత్తం భవనం నేలమట్టం అయ్యింది. ఈ ఘటన గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ – ఒడిశా సరిహద్దు సమీపంలోని ఒక గ్రామంలో ఇంట్లో అక్రమ బాణాసంచా కేంద్రం పనిచేస్తుంది.. ఈ క్రమంలోనే పేలుడు సంభవించిన 7గురు మృతి చెందారు, మరో ఐదుగురు గాయపడ్డారు. దీనిపై విచారణ జరుగుతుంది అని అన్నారు.