Cell Phone: సెల్‌ఫోన్ పేలిన సందర్భాలు చాలానే చూశాం. సాధారణంగా ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నపుడు ఇలా జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదం ఎక్కువ. కానీ, కొన్నిసార్లు సెల్‌ఫోన్లు పేలకుండా మండుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదం తక్కవే అని చెప్పొచ్చు. అయితే, జేబులో పెట్టుకున్నపుడు సెల్‌ఫోన్ కాలి, అది గమనించకపోతే మటుకు ప్రాణాలకు ప్రమాదం. మనం ఇంట్లోనో.. బయట ఉన్నప్పుడో ఇలా జరిగితే మన ఒక్కరితోనో ముగుస్తుంది. అలా కాకుండా విమానంలో ఉంటే.. ఇది ఊహించటానికే భయంకరంగా ఉంటుంది. ఫోన్ పేలినా.. దాని ద్వారా మంటలు వ్యాపించినా విమానం మొత్తం ప్రమాదంలో పడి అందులోని వారు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది.
తాజాగా, ఓ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి సెల్‌ఫోన్‌నుంచి మంటలు వచ్చాయి. సిబ్బంది సకాలంలో స్పందించటంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. గురువారం ఇండిగోకు చెందిన 6E-2037 విమానం ప్రయాణికులతో డిబ్రుగర్‌నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్‌నుంచి మంటలు మొదలయ్యాయి. సెల్‌ఫోన్‌నుంచి పొగతో కూడిన చిన్న మంటలను గుర్తించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే దాన్ని ఆర్పేశారు. సిబ్బంది సకాలంలో స్పందించటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్షేమంగా ఢిల్లీ విమానశ్రయానికి చేరుకుంది. బ్యాటరీ వేడెక్కి ఇలా జరిగిందని ఇండిగో అధికారులు తెలిపారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. కమోడ్‌లో ఇరుక్కున్న బిడ్డ