ఈ కాలంలో మనిషి డబ్బుకు ఎంత విలువ ఇస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఫ్రీగా వస్తే దేన్నీ వదలరు.. రోడ్డుపై ఏదైనా ఖరీదైన వస్తువు, డబ్బు దొరికితే చటుక్కున దాచుకునే వారు కొంతమంది ఉంటారు. కానీ కొంతమందిలో నిజాయితీ దాగి ఉంటుంది.. తమకు దొరికిన వస్తువులు.. డబ్బు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అప్పగిస్తారు.
ఈ కాలంలో ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు.. రోడ్డు పై పది రూపాయలు కనిపిస్తే గుట్టు చప్పుడు కాకుండా చేబులో వేసుకొని వెళ్లే కాలం.. అలాంటిది కొంతమంది లక్షల కొద్ది డబ్బు దొరికినా.. విలువైన వస్తువులు దొరికినా పోలీసులకు అప్పజెప్పి వాటి యజమానులకు చేరేలా చేస్తున్నారు. అలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్రలో జరిగింది. ఓ రైల్వే కూలీకి రూ.1.4 లక్షల విలువైన సెల్ ఫోన్ దొరికింది.. దాన్ని వెంటనే పోలీసులకు అప్పగించాడు. సెల్ ఫోన్ ట్రాక్ చేసి అసలైన యజమానికి అప్పగించారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ కాలంలో రోడ్డుపై పది రూపాయలు దొరికినా మహాభాగ్యం రా నాయనా అనుకుంటూ చటుక్కున జేబులో వేసుకునే వాళ్లను చూస్తుంటాం. అలాంటిది తమకు ఖరీదైన వస్తువులు, డబ్బు దొరికినా స్వార్థపూరితంగా ఆలోచించకుండా పోలీసులకు అప్పగించి వారి యజమానులకు చేరేలా చేస్తుంటారు కొందమంది. ఇలాటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా మహారాష్ట్ర దాదర్ రైల్వే స్టేషన్ లో దాదాపు 30 ఏళ్లుగా కూలీ పనులు చేస్తున్నాడు దశరథ్ డౌండ్. రోజంతా కష్టపడితో ఆయన కూలీ మహా అంటే రూ.300 మాత్రమే వస్తుంటాయి. సోమవారం రోజు రాత్రి దశరథ్ కి రైల్వే స్టేషన్ లో తన పనిముగించుకొని వెళ్తున్న సమయంలో ప్రయాణీకులు కూర్చునే చోట ఓ ఖరీదైన ఫోన్ కనిపించింది.
ఖరీదైన ఫోన్ దొరికిన వెంటనే దశరథ్ వెంటనే దాచుకోకుండా అక్కడ ఉన్నవారందరినీ ఫోన్ మీదేనా అంటూ అడిగాడు. ఎవరూ తమది కాదు అన్నారు.. దాంతో ఆ ఫోన్ రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుల ఫోన్ దొరికిన వెంటనే గుట్టుగా దాయకుండా నిజాయితీగా తీసుకు వచ్చి అప్పగించినందుకు ముందుగా పోలీసులు దశరథ్ ని ఎంతోగానో అభినందించారు. ఆ ఫోన్ ఖరీదు 1.4 లక్షలు అని తెలుసుకున్నారు. వెంటనే ఫోన్ ట్రాక్ చేయగా సదరు సెల్ ఫోన్ బాలీవుడ్ బాద్ షా అమితాబచ్చన్ కి అత్యంత నమ్మకస్తుడు.. మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న దీపక్ సవంత్ అని తెలుసుకున్నారు. అతనికి సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే స్టేషన్ కి వచ్చిన దీపక్ సవంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. పోయిందనుకున్న ఫోన్ మళ్లీ తనవద్దకు వచ్చింది. అంత సహాయం చేసిన కూలీ దశరథ్ కి ప్రత్యేకంగా అభినందనలు చెప్పడమే కాదు.. రూ.1000 బహుమానం అందించాడు. పోలీస్ సిబ్బంది, దీపక్ సవంత్ అతని కుటుంబ సభ్యులు దశరథ్ డౌండ్ ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దశరథ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంత పేదరికంలో ఉండి కూడా ఏమాత్రం స్వార్ధపు ఆలోచన లేకుండా ఖరీదైన ఫోన్ యజమానికి అందేలా సహాయం చేసిన దశరథ్ ని నెటిజన్లు ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నారు.
#Coolie finds Rs 1.4 lakh phone of #AmitabhBachchan aide, gives it to cops https://t.co/tFaUNRiCZz
— The Times Of India (@timesofindia) March 22, 2023