తాము కోరుకున్నదాని కోసం దేనికైనా సిద్దపడుతుంటారు. ఇటీవల
ఈ మద్య ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ సర్వసాధారణం అయ్యింది. చిన్న చిన్న గ్రామాల్లో సైతం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. సెల్ ఫోన్ ఎవరికైనా ఉంటుంది.. కానీ యాపిల్ ఐఫోన్ మెయింటేన్ చేయాలంటే కాస్త ఖరీదైన వ్యవహారమే అని చెప్పొచ్చు. చాలా మందికి ఎలాగైనా ఐఫోన్ కొనాలనే తపన ఉంటుంది.. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల కొనలేకపోతుంటారు. ఓ యువకుడు ఐఫోన్ కోసం ఏకంగా తన ప్రాణాలనే రిస్క్ లో పెట్టాడు.. వివరాల్లోకి వెళితే..
ఓ యువకుడు ఎప్పటి నుంచో ఐఫోన్ కొనాలనే ఆశపడేవాడు.. కానీ అతని వద్ద డబ్బు లేకపోవడంతో చివరికి ఐఫోన్ చోరీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో ఐఫోన్ కావాలని ఓ షోరూంకి వెళ్లాడు. అక్కడ లక్షన్నర విలువ చేసే 14 PRO మాక్స్ ఫోన్ ను సెలెక్ట్ చేశాడు. ఫోన్ చాలా బాగుంది.. ఒక్కసారి చెక్ చేస్తా అంటూ స్టోర్ నుండి బయటికి వచ్చాడు. షాప్ వాళ్లు బిజీగా ఉండటం చూసి రెండో ఫ్లోర్ నుండి కిందికి దూకేసాడు. దీంతో అతడు తీవ్రంగా దెబ్బల పాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అతను సెకెండ్ ఫ్లోర్ నుండి దూకిన సీసీ కెమెరా దృశ్యాలు నట్టింట వైరల్ అవుతున్నాయి. ఐఫోన్ మనోడి కొంప ముంచింది అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తే.. ఐఫోన్ సంగతి ఏమో కానీ.. హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకోరా బాబూ అంటూ.. కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఐఫోన్ దొంగతనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
నిత్యం మనకు సెల్ ఫోన్ లేనిదే ఏ పని గడవని పరిస్థితి నెలకొంది. ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరికి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండవలసిందే. ఇప్పటి జనాలు పక్కనున్న మనిషితో సంబంధం లేకుండా ఫోన్ లోనే ఎక్కు వగా మాట్లాడుతున్నారు. ఫంక్షన్ కు వెళ్లిన దగ్గర, స్నేహితుల మధ్యన, బంధువుల దగ్గర స్టేటస్ చూపించుకునేందుకు ఐఫోన్ తో ఛాటింగ్ లు, మీటింగ్ లు చేస్తుంటారు. పనులు తొందరగా కావాలన్నా ఫోన్ కావాలి. మనిషికి సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ప్రపంచంలోని అన్ని విషయాలను క్షణాలమీద తెలుసుకోవాలి.. వాటిని షేర్ చేయాలి. సెల్ఫీలు, ఫొటోలు దిగాలి అవి పోస్ట్ చేయాలి. ఇన్ స్టాలు, వాట్సాప్ లు, స్టేటస్ లు, ఫేస్ బుక్ లు, గూగుల్ లో ఇలా అన్నింటిలో చుట్టేయాల్సిందే.. అందుకే సెల్ ఫోన్ ప్రాధాన్యత పెరిగిపోతుంది.
Dude jumps off 2nd floor trying to get away after robbing Apple store 😬 pic.twitter.com/pdEjodh1Ka
— Crazy Clips (@crazyclipsonly) May 17, 2023