ప్రభుత్వ శాఖల్లో ఉండే అవినీతి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారిలో ఎక్కువ శాతం.. గుమస్తా మొదలు..ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి వరకు ప్రతి ఒక్కరు ప్రజలను జలగల్లా పట్టి పీడించాలని చూస్తారు. ప్రభుత్వ శాఖలో ఏ చిన్న పని జరగాలన్నా లంచం తప్పనిసరి. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంత చిన్న ప్రభుత్వ ఉద్యోగి ఇంటి మీద రైడ్ చేసినా సరే.. కట్టల కొద్ది నగదు.. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వస్తాయి. ఆఖరికి క్లర్క్ ఉద్యోగం చేసే వారి ఇంటిలో కూడా భారీగా నగదు పట్టుబడుతుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా పని చేస్తున్న వ్యక్తి ఇంట్లో అధికారులు సోదా చేయగా.. భారీ ఎత్తున నగదు వెలుగు చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ క్లర్క్‌గా పని చేస్తున్న హీరో కేశ్వాని నివాసంలో ఆర్థిక నేరాల విభాగం అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో.. అధికారులు.. సుమారు కోటి రూపాయలు రికవరీ చేశారు. దీంతో పాటు అతని భార్య పేరు మీదున్న మూడు కాస్ట్లీ కార్లను సీల్ చేశారు. అంతేకాక ఆమె పేరు మీద ఉన్న లక్ష రూపాయల నగదు, కోట్లాది రూపాయల ఆస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ క్లర్క్‌గా పని చేస్తున్న కేశ్వానికి ఇంత భారీ మొత్తంలో ఆస్తులు ఎలా వచ్చాయి అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అధికారులు కేశ్వాని ఇంట్లో సోదాలు చేయడానికి రాగానే అతడు టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. అధికారులు వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. ఇక కేశ్వాని 5000 రూపాయల జీతంతో కెరీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం 50,000 వేల రూపాయల జీతం తీసుకుంటున్నాడు. కానీ అతడి వద్ద కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉండటం గమనార్హం.
ఇక కేశ్వాని ఇంటి గోడల్లోనూ నగదు పట్టుబడిందని అధికారులు తెలిపారు. స్టోర్ రూమ్‌లో, ఇంట్లో ప్రతి మూలనా ఒక రహస్య ప్రదేశాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇక కేశ్వాని నివాసంలో భారీగా డబ్బుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.