జీవించడానికి గూడు లేక, తినడానికి సరైన తిండిలేక గత్యంతరం లేని పరిస్థితిలో యాచక వృత్తి చేపడతారు. కొంతమంది వృద్దాప్యంలో చేయడానికి ఏ పనిలేక గుళ్లు, బస్టాండ్ ఇతర జనసంచారం ఉన్న చోట్ల బిక్షాటన చేస్తుంటారు. వృద్దాప్యంలో యాచక వృత్తి అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని… కానీ తప్పని పరిస్థితుల్లో యాచిస్తుంటారు. ఓ యాచకుడు తన భార్యకు అలాంటి ఇబ్బంది రావొద్దని ఒక మోఫెడ్ బండిని బహుమతిగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..
సంతోష్ సాహూ అనే ఒక యాచకుడు కొంత కాలంగా తోపుడు బండిపై బిక్షాటన చేస్తున్నారు. గతకొంత కాలంగా తోపుడు బండిపై తిరుగుతు భిక్షాటన చేయటానికి భార్య పడే కష్టాన్ని చూడలేక ఆ భిక్షగాడు భార్యకు ఓ మోపెడ్ బండి కొని బహుమతి ఇచ్చాడు. నాలుగేళ్లుగా తాము బిక్షాటన చేసిన సొమ్ములో కొంత దాచుకుంటూ వచ్చాడు సంతోష్. ఎలాగైనా ఒక మోఫెడ్ కొని తన భార్య కష్టాలు తీర్చాలని భావించాడు. ఈ క్రమంలో రూ.90 వేలు విలువ చేసే ఒక బండిని తీసుకొని తన భార్యకు కానుకగా ఇచ్చాడు. ఎక్కడికి వెళ్లినా బండిపై వెళుతూ బిక్షాటన చేస్తున్నారు.
మద్యప్రదేశ్ కి చెందిన సంతోష్ సాహూ కి రెండు కాళ్లు లేవు. దీంతో ఏ పని చేయలేక చివరికి యాచక వృత్తిని ఎన్నుకున్నారు. ఆయన భార్య మున్ని అన్ని విధాలుగా సహకరించేది. వీరు మూడు చక్రాల బండి తీసుకున్నారు. తన భార్య ట్రై సైకిల్ తోస్తుండగా గడి, బడి, బస్టాండ్ ఇలా రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరిగేవారు. ప్రతిరోజూ ట్రైసైకిల్ తోసుకుంటూ వెళ్లాల్సి రావడంతో అతని భార్య తరచూ అనారోగ్యం పాలవుతుండేది.
ఇది గమనించిన సంతోష్ సాహు ఒక బండి తీసుకొని ఆ బండిపై భార్యను కూర్చో బెట్టాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే సాహు మోపెడ్‌ను కొనుగోలు చేయగా ఇప్పుడు ఆ దంపతులు మోపెడ్‌పై భిక్షాటన చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.