యువతీ యువకులు పొరపాటును చేసే పనులు చివరికి ఎన్నో అనార్ధాలకు దారి తీస్తున్నాయి. సరదాగా నవ్వుకుంటూ చేసే పనులు చివరికి ఓ పెద్ద తప్పుగా నిలిస్తూ ఏకంగా జైలు జీవితాలను కూడా అనుభవిస్తున్నారు. ఇక కొత్తగా పెళ్లి కాబోయే ఓ అమ్మాయి తనకు కాబోయే భర్త కోరికను తీర్చేందుకు ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం కాస్త బెడిసి కొట్టి చివరికి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుంది.
అసలు విషయం ఏంటంటారా..? మధ్యప్రదేశ్‌లోని 15 రోజుల క్రితం ఓ యువతికి ఒక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. కొన్ని రోజుల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక ప్రతీ రోజు ఫోన్‌లో సరదాగా మాట్లాడుకోవటం ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. అయితే ఒక రోజు తనకు కాబోయే భర్త యువతి స్నానం చేస్తుండగ వీడియో కావాలని చెప్పటంతో ఆ యువతి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పంపేందుకు సిద్దమై ఆ వీడియోను తనకు కాబోయే భర్తకు కాకుండా పొరపాటున తన ఫ్రెండ్‌కు పంపింది. దీంతో ఆ యువతి ఆ వీడియోను ఊర్లో అందరికీ పంపటంతో ఊరంతా తెలిసి పోయింది. వారి తల్లిదండ్రులకు ఇంట్లోని అందరికీ పాకింది. ఇక మనస్థాపానికి గురైన ఆ యువతి విషం తాగి సూసైడ్ చేసుకుంది. ఇక స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.