ప్రజలకు జవాబుదారీ తనంగా వ్యవహరించాల్సిన ప్రజా ప్రతినిధులు.. ముడుపులు తీసుకుంటూ.. భారీ అవినీతికి పాల్పడుతున్నారు. దోచుకుంటూ .. ఆపై పట్టుబడుతూ శాసన వ్యవస్థను అవహేళన చేస్తున్నారు. తాజాగా ఓ అవినీతి కేసులో బీజెపీ ఎమ్మెల్యే అరెస్టు అయ్యారు.
దేశంలో అవినీతిపరులు ఎక్కువవుతున్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగుస్థులే అనుకుంటే పొరపడినట్లే. ప్రజాతంత్ర దేశంలో ప్రజా ప్రతినిధులుగా ఉంటూ, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన శాసనకర్తలు అవినీతిమయంలో కూరుకుపోతున్నారు. అధికారంలో ఉన్నంత సేపు దండిగా కూడబెట్టుకునేందుకు భారీ అవినీతికి పాల్పడుతున్నారు. దొరికినదంతా దోచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల హోదాలో ఉండీ.. ఏదన్నా పనిచేసి పెట్టాలంటే చేతులు తడపాల్సిందే. చిన్న దానిపై సంతకాలు చేయాలన్న ఆమ్యామ్యా చదివించాల్సిందే. చివరకు వీరి పాపాలు పండితే కానీ గుట్టు రట్టవ్వడం లేదు. అయితే అండ బలం, ఆర్థిక బలంతో కేసుల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నాలు జరగడం పరిపాటి. అయితే అన్ని వేళలా ఆటలు చెల్లవుగా.. అదే అయ్యిందీ బీజెపీ ఎమ్మెల్యే విషయంలో.
కర్ణాటక బీజెపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప అవినీతి కేసులో అరెస్టు అయ్యారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు సంబంధించి ఓ అవినీతి కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన కొడుకు ప్రశాంత్ మదల్ సుమారు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ గత నెలలో లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL)కి మదల్ విరూపాక్షప్ప చైర్మన్. ప్రసిద్ధ మైసూర్ శాండల్ సబ్బు తయారీదారులు. ఆయన కుమారుడు ప్రశాంత్ మదల్. ప్రశాంత్ బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. కేఎస్‌డీఎల్ కార్యాలయంలో ప్రశాంత్ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులకు దొరికిపోయాడు. అయితే అతడి ఇళ్లు, నివాసాల్లో సోదాలు చేయగా.. రూ. 8 కోట్లు లభించింది.
ఈ అవినీతి కేసు బయటకు రాగానే దేవణగిరి జిల్లా చన్నగిరి ఎమ్మెల్యే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ పోస్టు నుంచి వైదొలిగారు. అయితే ఈ ఘటనపై అంబుడ్స్‌మన్ స్వతంత్ర విచారణ జరుపుతారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. అయితే దీనిపై ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ముందస్తు బెయిల్ లభించగానే దేవాంగిరిలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అయితే, ఈ బెయిల్‌ను అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విరూపాక్షప్ప ఎమ్మెల్యే.బెయిల్ రద్దు అయిన తర్వాత ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు ముడిసరుకు సరఫరా చేసేందుకు టెండర్ తీసుకునేందుకే లంచం తీసుకున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న లోకాయుక్త పోలీసులు తెలిపారు.