ప్రజలకు జవాబుదారీ తనంగా వ్యవహరించాల్సిన ప్రజా ప్రతినిధులు.. ముడుపులు తీసుకుంటూ.. భారీ అవినీతికి పాల్పడుతున్నారు. దోచుకుంటూ .. ఆపై పట్టుబడుతూ శాసన వ్యవస్థను అవహేళన చేస్తున్నారు. తాజాగా ఓ అవినీతి కేసులో బీజెపీ ఎమ్మెల్యే అరెస్టు అయ్యారు.
అవినీతి అనేది ప్రజలను పట్టి పీడిస్తున్నా ఓ భూతం. ఈ అవినీతి వలన న్యాయం జరగాల్సిన ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది. దీని వలన సమాజంలో అనిశ్చితి నెలకొంటుంది. ఈ అవినీతి అనేది ప్రభుత్వ శాఖల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ ప్రధానంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖలో ఎక్కువగా ఉంటుందని కొందరి అభిప్రాయం. వారి అభిప్రాయాలకు ఊతమిస్తూ పోలీసుల్లో 90 శాతం మంది అవినీతిపరులే అంటూ తాజాగా చెన్నై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను […]