ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో విచ్చలవిడి తనం బాగా పెరిగిపోయింది. కొన్ని ప్రేమ జంటలు రోడ్డున పడి రొమాన్స్‌కు పాల్పడుతున్నాయి. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, ఓ ప్రేమ జంట బైకుపై కబుర్లు చెప్పుకుంటూ...
కొన్ని ప్రేమ జంటలు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. విచక్షణ మరిచిపోయి విచ్చల విడితనంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రైవేట్‌గా చేయాల్సిన పనులను కూడా పబ్లిక్‌లో చేస్తున్నాయి. ప్రేమ జంటలు బైకులపై వెళుతూ రొమాన్స్ చేసుకున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. మొన్నీ మధ్య ఏపీలో ఓ ఇంటర్ కాలేజీ విద్యార్ధులు స్కూటీపై రొమాంటిక్‌గా వెళుతూ అడ్డంగా బుక్కయింది. తర్వాత దేశ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి. ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ప్రేమ జంట బైకుపై రొమాంటిక్‌గా ప్రయాణిస్తూ ఉంది.
ప్రియుడు బైక్ నడుపుతూ ఉండగా.. ప్రియురాలు అతడి ముందు.. పెట్రోల్ ట్యాంకుపై కూర్చుని ఉంది. ఇద్దరూ ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇది రోడ్డుమీద వెళుతున్న వారి దృష్టిని ఆకర్షించింది. అందరూ వారి వైపు చూస్తూ నవ్వుకుంటూ వెళుతూ ఉన్నారు. కారులో వెళుతున్న ఓ వ్యక్తికి వీరిని చూసి కన్ను కుట్టింది. వెంటనే ప్రేమ జంటను వీడియో తీయటం ప్రారంభించాడు. ఇది గమనించని వారు తమ మానాన బైకుపై కబుర్లు చెప్పుకుంటూ వెళ్లారు. ఇక, ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ ఇలాంటి సంఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. అలాంటివారిని ఊరికే వదిలేయకూడదు.
దండేసి దండం పెట్టాలి’’.. ‘‘ ప్రేమికులన్న తర్వాత ఆ మాత్రం సాహసం చెయ్యాలి. రేపు గుర్తుండిపోయేవి ఇలాంటి ఘటనలే’’.. ‘‘ప్రభుత్వం ఇలాంటి ప్రేమికులకు కఠిన శిక్షలు వెయ్యాలి’’..‘‘ స్వేచ్ఛను దుర్వినియోగపర్చటం అంటే ఇదే’’..‘‘ రాత్రిళ్లు చాటింగ్ సరిగా చేసుకున్నట్లు లేరు. అందుకే ఇలా రోడ్డున పడ్డారు’’.. ‘‘ ప్రేమ పేరుతో ఇలా బలాదూరులు తిరగటం ఎక్కువయిపోయింది’’.. ‘‘ ఏది ఏమైనప్పటికి ప్రేమ జంటలు ఇలా చేయటం కచ్చితంగా తప్పే..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.