మన అవసరాలను తీర్చుకునేందుకు నిత్యం మనకు డబ్బులు చాలా అవసరం. అవసరానికి తగిన డబ్బులు కావాలంటే రుణాలు తీసుకుంటాం. బ్యాంక్ ద్వారా లోన్స్ తీసుకునేముంద ఈ విషయాలను తెలుసుకుంటే మంచిది.
మనకు నిత్యజీవితంలో డబ్బుతో చాలా అవసరాలు ముడిపడి ఉంటాయి. అవసరాలను అధిగమించాలంటే ప్రతి వ్యక్తికి జీవితంలో డబ్బులు కావాలి. ప్రతి మనిషి సుఖమైన జీవితాన్ని పొందాలంటే డబ్బు కావాలి. డబ్బులు కావలసి వస్తే మనం ఎవరి దగ్గరనైనా వడ్డీలకు తీసుకుని మన అవసరం అయిపోయిన తర్వాత చెల్లిస్తాం. లేదా పెద్ద మొత్తంలో కావలసి వస్తే బ్యాంకులలో లోన్స్ తీసుకుంటాం. బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లను కూడా తెలుసుకోవాలి. పర్సనల్ లోన్స్‌పై వడ్డీరేటు ఒక్కొక్క బ్యాంకులో ఒకలా ఉంటుంది. ఈ డీటైల్స్ తెలుసుకోకుండా లోన్స్ తీసుకుంటే తర్వాత ఇబ్బందులు పడక తప్పదు. ప్రస్తుతం తక్కువ వడ్డీరేటుకు లోన్స్ అందిస్తున్న టాప్ 5 బ్యాంకులు ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం..
తక్కువ వడ్డీకి రుణం అందిస్తున్న బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒకటి. ఈ బ్యాంకులో రుణం తీసుకుంటే గరిష్టంగా 84 నెలల దాకా టెన్యూర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు 10 % నుండి ప్రారంభం అవుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఇందులో కూడా 84 నెలలు టెన్యూర్ పెట్టుకోవచ్చు. అలాగే వడ్డీ రేటు 10.25 శాతం నుండి స్టార్ట్ అవుతుంది. ఇకపోతే మరో బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇది కూడా తక్కువ వడ్డీరేట్లకే లోన్స్ అందిస్తుంది. వడ్డీరేటు 10.4 % నుండి ప్రారంభం అయి గరిష్టంగా 16.95% వరకు వడ్డీ రేటు ఉంటుంది. 60 నెలల ఈ ఎం ఐ లు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్‌ను చూస్తే ఇక్కడ కూడా వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. ఈ బ్యాంకులో పర్సనల్ లోన్స్‌కు వడ్డీ రేటు 10.49 శాతం నుండి ప్రారంభమవుతుంది. గరిష్టంగా 22 శాతం వరకు వడ్డీ పడుతుంది. 60 నెలల వరకు ఈ ఎం ఐ పెట్టుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంకుల్లో పెద్ద బ్యాంకుగా చెలామణి అవుతున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుంది. పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.5 శాతం నుండి ప్రారంభమవుతోంది. గరిష్టంగా 24 శాతం వడ్డీ ఉంటుంది. అందుకే బ్యాంకు లోన్ తీసుకునే ముందు వడ్డీరేట్లను పరిశీలించాలిన లేదంటే వడ్డీల భారంతో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. లోన్స్ తీసుకునే ముందు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే బ్యాంకులను ఎంచుకోవడం మంచిది.