దాణా కుంభకోణంలోని మరో కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ని రాంచి సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాలు కు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమాన విధించింది కోర్టు.
1990లో లాలు ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు ప్రక్కదారి పట్టించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఇది దాణా కుంభకోణం కేసుల్లో ఐదోది. అంతే కాకా దాణా కుంభకోణం కేసుల్లో అతి పెద్దది కూడా. దాదాపు 25 ఏళ్ల తరువాత దాణా స్కామ్ లో ఈ కేసులో సీబీఐ కోర్టు లాలూను దోషిగా తేల్చింది. దాణా కుంభకోణానికి చెందిన మొత్తం ఐదో కేసుల్లోనూ లాలు ప్రసాద్ దోషిగా నిలిచారు. సీబీఐ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని ఆర్జేడీ నేతలు తెలిపారు.మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.