YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. దావోస్‌లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. ఈ నెల 19నుంచి 31వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని ఆయన తన పిటిషన్‌లో కోర్డుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో దావోస్‌కు అధికారిక పర్యటనకు వెళుతున్నట్లు తెలిపారు. అయితే, సీఎం జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దావోస్‌కు వెళ్లేందుకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని, విదేశాలకు వెళితే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని కోర్టుకు తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి 31వరకు విదేశీ పర్యటనకు వెళ్లొచ్చని కోర్టు స్పష్టం చేసింది
కాగా, ప్రపంచ వాణిజ్య సదస్సు మే 22 నుంచి 26 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనుంది. పలు దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరవుతారు. భారత్‌నుంచి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణనుంచి మంత్రి కేటీఆర్, కర్ణాటక నుంచి సీఎం బసవరాజ బొమ్మై, మహారాష్ట్ర నుంచి సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. సీఎం జగన్ నాయకత్వంలోని బృందం ‘ఆంధ్రప్రదేశ్‌లోని అవకాశాలు.. ఇక్కడి ప్రజల పురోగతి’ అన్న ప్రధాన అంశంతో సదస్సులో పాల్గొననుంది. రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఉండబోతోంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు గుడివాడ అమర్ నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పివి మిథున్ రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దావోస్ వెళ్తున్నారు. మరి, సీఎం జగన్ దావోస్ పర్యటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Narayana: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని.. కోర్టులో పిటిషన్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.