రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. పార్టీపరంగా ఉన్నప్పుడు.. దానికి సంబంధించిన నియమాలనే ఫాలో కావాలి. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం.. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా అందరిని కలుపుకుపోవాలి.. అందరితో కలిసి పోవాలి. ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. ప్రైవేట్ లైఫ్‌లో అందరితో కలిసి పోవాలి. ఇదే సూత్రాన్ని తన నిత్య జీవితంలో పాటిస్తారు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్. పార్టీ పరంగా నేతలపై ఘాటు విమర్శలు చేస్తారు.. కానీ వ్యక్తిగతంగా మాత్రం అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈటెలపై పలు ఆరోపణలు చేయడం, ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. అయితే.. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈటెల, కేటీఆర్ ఎదెరెదురుగా తారసపడ్డారు. వెంటనే కేటీఆర్.. ఈటెలను ఆలింగనం చేసుకుని.. ఆత్మీయంగా పలకరించారు. నేతల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఉడటం మంచిదే. ప్రస్తుతా దావోస్ వేదికగా అలాంటి మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: APలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయ్.. నరకంలో ఉన్నట్టుగా ఉంది: KTR
కొన్ని రోజుల క్రితం ఏపీలో కరెంటు కోతలు, రోడ్లు సరిగా లేవు. అక్కడి ప్రజలు నరకంలో ఉన్నట్లు ఫీలవుతున్నారు అంటూ ఏపీపై విమర్శలు చేసిన కేటీఆర్.. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఫోటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు ఏపీ తరఫున సీఎం జగన్, తెలంగాణ తరఫున మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కలిసి ఫోటోలు దిగారు. వీటిని కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో గొప్ప సమావేశం జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Had a great meeting with my brother AP CM @ysjagan Garu pic.twitter.com/I32iSJj05k
— KTR (@KTRTRS) May 23, 2022
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు తొలిరోజే భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. కేటీఆర్ సోమవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లూలు గ్రూప్స్ అధినేత యూసుఫ్ అలీ తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించారు. వెంటనే లూలు గ్రూప్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను సిద్ధం చేయించిన మంత్రి కేటీఆర్.. ఆ పత్రాలను అప్పటికప్పుడే యూసుఫ్ అలీకి అందజేశారు. స్పెయిన్‌కు చెందిన బహుళ జాతి కంపెనీ కీమో ఫార్మా కూడా రూ.100 కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ప్రకటించింది. కేటీఆర్ ట్వీట్‌పై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Kadapa district: అద్దె కట్టలేదని సచివాలయానికి తాళం వేసిన ఇంటి యజమాని!