దాణా కుంభకోణంలోని మరో కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ని రాంచి సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాలు కు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమాన విధించింది కోర్టు. 1990లో లాలు ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డోరాండా ట్రెజరీ నుండి […]