ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ కు రాంచీ కోర్టు షాకిచ్చింది. ఆయనపై గతంలో నమోదయిన దాణా కుంభకోణం ఐదో కేసులో లాలు ప్రసాద్ ను రాంచీ కోర్టు దోషిగా తేల్చింది. నాలుగు కేసులలో ఇంతకు ముందే దోషిగా తేలిన లాలుకు 14 ఏళ్ల శిక్ష విధించారు. ప్రస్తుతం ఐదో కేసులోనూ దోషిగా తేలారు. ఈ కేసులో ఫిబ్రవరి 18న ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో లాలూ సహా దోషులుగా తేలిన మరో 39 మందికి ఫిబ్రవరి 21న రాంచీ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పు వెలువరించింది. గతంలో నాలుగు కేసుల మాదిరే దీన్ని కూడా లాలూ పైకోర్టులో సవాలు చేస్తారని ఆయన తరఫు లాయర్లు తెలిపారు.
దాణా స్కాం కేసులో లాలూని రాంచీ కోర్టు దోషిగా తేల్చింది. మొత్త ఐదు కుంభకోణం కేసులు ఉండగా.. 139 కోట్ల రూపాయల ఐదో దాణా కుంభకోణం కేసులో లాలూని దోషిగా తేల్చింది రాంచీ కోర్టు. 1990-95 మధ్య డోరాండా ట్రెజరీ నుంచి 139 కోట్లు అక్రమంగా విత్ డ్రా చేసినట్లు లాలూపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి 1997లో సీబీఐ లాలూని దోషిగా చేర్చింది. 575 మంది సాక్షులను విచారించింది. 25 ఏళ్ల పాటు విచారణ సాగింది. 2021, ఆగస్టు 7న వాదలను పూర్తయ్యాయి. నాలుగు కేసుల్లో గతంలోనే తీర్పు వెల్లడించి, శిక్ష ఖారారు చేయగా.. తాజాగా ఐదో కేసులో కూడా రాంచీ సీబీఐ కోర్టు లాలూని దోషిగా తేల్చింది.