దేశంలోని ఓ రాష్ట్రంలో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. మెసేజ్ సర్వీసులను కూడా ఆపేశారు. అసలు ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు, ఏం జరిగిందంటే..!
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జలంధర్లో అతడ్ని అరెస్ట్ చేశారు. తప్పించుకోవాలని చూసినా పోలీసులు అతడ్ని చాకచక్యంగా వెంబడించి మరీ పట్టుకున్నారు. అతడి నుంచి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అమృత్పాల్ అరెస్టు నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచివేసింది సర్కారు. మార్చి 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు పంజాబ్లోని పలుచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ హోం వ్యవహారాలు, న్యాయశాఖ ప్రకటించింది.
అమృత్పాల్ అరెస్టుతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఉండటంతో పంజాబ్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తనను పోలీసుల బారి నుంచి రక్షించాలంటూ ప్రజలను వేడుకుంటున్నాడు అమృత్ పాల్. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు ముందస్తుగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. కాగా, ప్రత్యేక ఖలిస్థాన్ దేశాన్ని కోరుతూ వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఖలిస్థాన్ దేశాన్ని తాము కోరుకోవడంలో తప్పు లేదని.. ఇదో సిద్ధాంతమని అమృత్పాల్ రీసెంట్గా కామెంట్స్ చేశారు. తమ టార్గెట్ను మేధోపరంగా చూడాలని.. ఈ సిద్ధాంతానికి చావు లేదన్నారు.
All mobile internet services, all SMS services (except banking & mobile recharge) & all dongle services provided on mobile networks, except the voice call, in the territorial jurisdiction of Punjab shall be suspended from 18th March (12:00 hours) to 19th March (12:00 hours) in… https://t.co/NN3LeXoRZt pic.twitter.com/z3vXg4v158
— ANI (@ANI) March 18, 2023