పెళ్లైన భార్య భర్తల మధ్య సెక్స్ విషయంలో ఒకరి విషయాలు ఒకోలా ఉంటాయి. దీనికి ఇద్దరి మధ్య సుముఖత కూడా ఎంతో అవసరం. పెళ్లైన భార్యభర్తల సెక్స్ విషయంపై ఒకరినొకరు అర్థం చేసుకునేలా వ్యవహరించకపోవటం వల్ల కొందరు విడాకుల వరకు వెళ్తూ ఆత్మహత్యలకు కూడా వెనకాడటం లేదు. భార్యకు ఇష్టం లేకుండా సెక్స్‌లో పాల్గొనాలని రాద్దాంతం చేస్తూ ఉంటారు. ఇక ఇదే విషయంపై కేరళ హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పును వెలువరించింది.
బలవంతంగా శృంగారం చేస్తే వారు విడాకులు తీసుకోవచ్చని తీర్పులో తెలిపింది. ఇక దీంతో పాటు బలవంతంగా భార్యకు ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే అది రేప్ కిందకు వస్తుందంటూ కీలక తీర్పును వెల్లడించింది. ఇక భారత చట్టాల ప్రకారం ఇది శిక్షార్హం కాదని, విడాకులు మాత్రం తీసుకనే అవకాశం ఉందని తీర్సులో తెలిపింది. కొందరు భర్తలు భార్యకు ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొనాలని గొడవ చేస్తారని అది ఖచ్చితంగా మానవ కృరత్వం కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తెలిపింది. ఇటీవల ఓ విడాకుల కేసులో కేరళ హైకోర్టు ఇలాంటి కీలక తీర్పును వెల్లడించింది.