ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజాప్రతినిధులను ఓట్లేసి గెలిపిస్తారు. ఎన్నికలకు ముందు ఇంటింటికీ తిరిగి ఎన్నో హామీలు, ప్రమాణాలు చేసిన వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖం చాటేస్తుంటారు. ఎక్కడో చాలా అరుదుగా ప్రజల కష్టాలు చూసే నాయకులు ఉంటారు. అయితే తాము ఓటేసి గెలిపించిన నాయకుడు తాము కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోకపోతే వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ ఎమ్మెల్యేపై గ్రామస్థులు దాడి చేసి బట్టలు చించి తరిమి తరిమి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..
గత కొంత కాలంగా కర్ణాటకలోని చిక్కమగళూరు పరిసర ప్రాంతాల్లో ఏనుగులు పంటపొలాలపైనే కాదు.. మనుషులపై కూడా దాడులు చేస్తూ చంపేస్తున్నాయి. ఏనుగుల భారి నుంచి తమను రక్షించాలని గ్రామస్థులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం హుల్లేమేన్ గ్రామానికి చెందిన ఓ మహిళపై ఏనుగు దాడి చేసి చంపేసింది. మహిళ చనిపోవడంతో ఆగ్రహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో ఏనుగు దాడిలో చనిపోయిన శోభ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే కుమార స్వామిని గ్రామస్థులు అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే కుమార స్వామిని గ్రామస్థులు ఇప్పటికైనా ఏనుగులు దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. గ్రామస్థుల ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం ఇవ్వకుండా మౌనం వహించాడు. దీంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో గ్రామస్థులు ఒక్కసారే ఆయనపై దాడి చేశారు. బట్టలు చించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాలు నాశనం చేశారు. ఎమ్మెల్యేని తరిమి కొట్టారు.. వెంటనే సెక్యూరిటీ గార్డులు, పోలీసులు అలర్ట్ అయి ఆయనను క్షేమంగా కారులో తరలించారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే కుమారస్వామి గ్రామస్థులపై మండిపడ్డారు. కొంత మంది గ్రామస్థులు తనపై పథకం ప్రకారమే దాడి చేశారని.. వాస్తవానికి ఏనుగుల దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాధానం చెప్పేలోపే దాడి చేశారని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Chikkamagaluru, Karnataka | Mudigere MLA from BJP, MP Kumaraswamy’s clothes were allegedly torn by locals of Hullemane village when he visited them following the death of a woman in an elephant attack. The villagers alleged that the MLA didn’t respond properly to elephant attacks pic.twitter.com/xIeCiSlBDX
— ANI (@ANI) November 21, 2022
Shobha (45) of #Hullemane village near #Kundur, #Mudigere taluk, died on Sunday morning due to elephant attack. It has been alleged that #BJP MLA #MPKumaraswamy who came late to the spot was beaten up and his clothes torn apart.#Karnataka #Chikkamagaluru #BJPGovt #BJPMLA pic.twitter.com/KPmRlcB53a
— Hate Detector 🔍 (@HateDetectors) November 20, 2022