మందు బాబులకు దిమ్మ తిరిగే వార్త.. త్వరలోనే మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఇప్పటికే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే
మందు బాబులకు భారీ షాకిచ్చే వార్త. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్. ఈ వార్త వినగానే మందు బాబుల గుండెలో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. అయినా ఇంత అర్జెంట్‌గా మద్యం దుకాణాలు బంద్ చేయాల్సిన అవసరం ఏంటి.. పండగలు, ఎన్నికలు ఏవి లేవు కదా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ రూల్ మన దగ్గర కాదు. పక్క రాష్ట్రం కర్ణాటకలో. ఎందుకు అంటే.. మరో ఐదు రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా.. 13న ఫలితాలు వెలువడున్నాయి. పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
ఎన్నికల పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకోకుండా మద్యం విక్రయాలను నిషేధిస్తూ అధికారలు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీన ఎన్నిలక పోలింగ్ జరుగుతుందని.. ముందుజాగ్రత్త చర్యగా మే 8వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మే 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కౌంటింగ్ రోజున అనగా మే 13న ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కౌంటింగ్ రోజున ఆ రోజున కూడా ఉదయం 6 గంటల నుంచి మే 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడులో డ్రై డే కోసం ఇప్పటికే నోటిఫై చేశారు. అన్ని బార్లు, రెస్టారెంట్లు, రిటైల్ అవుట్‌లెట్‌లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మద్యం విక్రయాలు, సరఫరాపై అనేక ఆంక్షలు విధించారు. అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో మద్యం విక్రయాలను నిషేధించాలని నోటీసులు జారీ చేయడమే కాక.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో.. అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచారు. ఇక హస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే.