ప్రేమలో మునిగిన తేలుతున్న నేటి తరం లవర్స్ తమలోని భావాలను తెలుపుకునేందుకు సాధారణంగా పార్క్‌లకు వెళ్తూ ఉంటారు. అక్కడ తమకు తెలిసిన వాళ్లు ఎవరూ ఉండరని ఆ మార్గాన్ని వేదికగా ఎంచుకుంటారు. తీర అక్కడికి వెళ్లాక వాళ్ల రోమన్స్, ముద్దులతో పార్క్‌కు వచ్చిన వారందరినీ తమ వైపు తిప్పుకునేలా చేస్తారు. ముద్దులు పెట్టుకోవటం, కౌగిలించుకోవటం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక పార్క్ అన్నాక ప్రేమికులు, పిల్లలు, పండు ముసలీ ఇలా అన్ని వయస్సుల వారు వస్తూ ఉంటారు. దీంతో వారు చేసి పనులకు అక్కడికి వచ్చిన చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతు అక్కడి నుండి దూరంగా వెళతారు.
ఇలా లవర్స్ రోమాన్స్‌ను చూడలేక మాహారాష్ట్రలోని ఓ ప్రాంత కాలనీ వాసులు మాత్రం ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ముంబైలోని బోరీవలిలో సత్యం శివం సుందరం అనే కాలనీలో ప్రతీ రోజు ప్రేమికుల జంటలు అక్కడికి చేరుకుంటారట. చాలా మంది లవర్స్ అక్కడికి చేరుకుని ముద్దులు, రోమాన్స్‌తో ఆ కాలనీ అంతా రచ్చ రచ్చ చేస్తున్నారట. దీంతో వీరి రోమాన్స్‌ను చూడలేక ఏకంగా లవర్స్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఏంటనుకుంటున్నారా..?
ఇక ఆ కాలనీవాసులు కొంత మంది ఏకమై లవర్స్‌ని రాకుండా నో కిస్సింగ్ జోన్ అని రోడ్డుపై రాశారు. దీంతో ప్రతీ రోజు వచ్చే ప్రేమికులు ఆ రాతలను చూసి అక్కడకి రాకుండా వెళుతున్నారట. ఈ వార్త తెలిసిన ప్రేమికులు కొంతమంది ఇలా చేయటమేంటని వాపోతుండటంతో మరికొంతమంది కాలనీవాసులు చేసిన పని కరెక్టే అంటూ వత్తాసు పలుకుతున్నారు. ఇలా చేయటం కరెక్టే..? తప్పా..? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.