రష్యా, ఉక్రెయిన్ ల మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఉక్రెయిన్ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు వేగవంత చేసింది. “ఆపరేషన్ గంగా”లో భాగంగా ఇప్పటి వరకు వేల మంది విద్యార్థులను భారత్ కు తిరిగొచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే స్వదేశానికి చేరిన విద్యార్థులను అధికారులు పువ్వులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఓ విద్యార్థి మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకుండా ఇప్పుడు గులాబీ పువ్వులు ఇవ్వడమేంటి అంటూ కేంద్రంపై ఆ విద్యార్థి విమర్శలు గుప్పించాడు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్న భారతీయులను తిరిగి రప్పించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు 18 వేల మందిని భారత్ కు తిరిగొచ్చినట్లు కేంద్ర విదేశాంగశాఖ తెలిపింది.గత 24 గంటల్లో 3 వేల మంది భారతీయులు 15 విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి వచ్చారని పేర్కొంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన బీహర్ కు చెందిన దివ్యాన్షు సింగ్ తీవ్రగా విమర్శించాడు.
“యుద్ధ వాతావరణం ఉన్న అక్కడి నుంచి పౌరులను రక్షించేందుకు సరైన సమయంలో చర్యలు తీసుకోనప్పుడు.. ఇక్కడి వచ్చిన తరువాత గులాబీ పువ్వులు అందించడం అర్థరహితం. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి గులాబీ ఇచ్చారు. దీని అర్థం ఏమిటి? ఒక వేళ అక్కడ మాకు ఏదైనా జరిగితే మా కుటుంబాల పరిస్థితి ఏంటీ. సరైన సమయంలో స్పందించి ఇతర దేశాలలాగా రోడ్ మ్యాప్ రూపొందించి ఉంటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు” అని కేంద్రంపై విమర్శలు గుప్పించాడు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తరువాత గులాబీ అందించిన అధికారుల స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా.. మీకు భారత ఎంబసీ ఏ విధంగా సహకరించిందని ప్రశ్నించగా.. దివ్యాన్షు పై విధంగా ఘాటుగా బదులిచ్చాడు. మరి.. అతడి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.