భారతదేశంలో ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్ ఎంతో ఇష్టంగా తింటారు. త్వరగా అరుగుతుంది.. మంచి పౌష్టిక ఆహారం అని అందుకే చాలా మంది ఇడ్లీ అంటె తెగ ఇష్టపడతారు. రోడ్ సైడ్ హూటల్ నుంచి ఫైవ్ స్టార్ హూటల్ వరకు ఇడ్లీ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇడ్లీలను సాంబార్‌తో తింటే ఆ మజాయే వేరు అంటారు. అయితే సాధారంగా ఇడ్లీలు గుండ్రంగా, త్రిభుజాకారంలో కొన్ని.. చిన్న చిన్న ఇడ్లీలు మనం చూసే ఉంటాం. తాజాగా ఐస్ క్రీమ్ స్టిక్ రూపంలో ఉన్న ఇడ్లీలకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ ఫోటోలో ఓ ఇడ్లీ ఐస్ క్రీమ్ స్టిక్ రూపంలో ఉండి.. సాంబారులో ముంచబడి ఉంది. పక్కనే మరో చిన్న గిన్నేలో చట్నీ కూడా ఉంది. మనం సాంబార్ ఇడ్లీ, ఘీ ఇడ్లీ, బటర్ ఇడ్లీ.. వంటి వెరైటీలు వినే ఉంటాం.. తినే ఉంటాం. ఇది పుల్ల ఇడ్లీ.. ఐస్ క్రీంను తలపించే పుల్ల ఇడ్లీనే. దేశ ఐటీ రాజధాని అయిన బెంగళూరులోని ఓ హోటల్ లో ఇలా కొత్తగా ఇడ్లీకి మేకప్ టచ్ ఇచ్చారన్నమాట. దీనికి సంబంధించి ఫొటో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కంట పడింది. అంతే వెంటనే ఆయన సృజనాత్మకతతో వెంటనే ట్విట్టర్ లో ఆ ఫొటో పెట్టేశారు.
‘‘భారత ఆవిష్కరణల రాజధాని అయిన బెంగళూరు.. సృజనాత్మకతలో ఎక్కడా ఆగట్లేదు. అసలు ఊహించని దారుల్లో ఊహించని కొత్త ఆవిష్కరణలు వచ్చేస్తున్నాయి. ఇదిగో ఈ పుల్ల ఇడ్లీనే ఉదాహరణ. సాంబార్, చట్నీలో ముంచుకుని తినేయడమే. మీకు నచ్చిందా? నచ్చని వారెవరైనా ఉన్నారా?’’ అంటూ ట్వీట్ చేశారు. ఆయన ట్విట్ కి వెంటనే నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. చెంచాలు, నీళ్ల కొరతకు మంచి ఉపాయం చేశారేనని ఇంకొకరు, చేతులు కడుక్కోవాల్సిన పనిలేదని, నీళ్లను ఆదాచేయొచ్చని మరొకరు కామెంట్ చేశారు. ‘వావ్ అచ్చం ఐస్ క్రీమ్‌లా ఉన్నాయి ఇడ్లీలు’, ‘చిన్న పిల్లలు తినడానికి బాగుంటుంది’ అని కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bengaluru, India’s innovation capital can’t stop its creativity from manifesting itself in the most unexpected areas… Idli on a stick—sambhar & chutney as dips…Those in favour, those against?? pic.twitter.com/zted3dQRfL
— anand mahindra (@anandmahindra) September 30, 2021