సోమవారం లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గానీ.. శాశ్వత మిత్రులు గానీ ఉండరు అనే సామెత అందరికి తెలిసిందే. ఇక ఈ సామెత రాజకీయాలకే కాదు క్రికెట్ కు కూడా వర్తిస్తుందని తాజాగా ఓ ఫోటో నిరూపిస్తోంది. ఆ ఫోటో ఎవరిదో కాదు.. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. 2011 వరల్డ్ కప్ హీరో గౌతమ్ గంభీర్ లది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. అయితే అందరు మ్యాచ్ విజయం గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ మ్యాచ్ అనంతరం ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ ల మధ్య 2013 ఐపీఎల్ సీజన్ లో గొడవ జరిగింది. అప్పట్లో ఈ గొడవ క్రికెట్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. విరాట్, గంభీర్ గ్రౌండ్ లోనే ఏకంగా బాహబాహీకి దిగారు. అప్పటి నుంచి వీరి మధ్య మాటలు సరిగ్గాలేవు. ఇక గంభీర్ కు విరాట్ తో పాటుగా ధోనితో కూడా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన, వింతైన ఘటన జరిగింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు.. తమ తమ డ్రెస్సింగ్ రూమ్ ల్లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఎదురు పడ్డారు. దాంతో అక్కడ ఉన్న వారంత ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ.. విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. దాంతో అక్కడున్న వారంత ఒక్కసారిగా షాక్ తిన్నారు. గతంలో ఒకరిని ఒకరు కొట్టుకోడానికి వెళ్లినంత పని చేసిన వీరిద్దరు ఇలా కౌగిలించుకోవడం అందరిని ఆశ్చర్యాన్ని గురించేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. దాంతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ వైపు చూస్తూ.. గంభీర్ చేసిన సైగలు కూడా వైరల్ గా మారాయి. మరి విరాట్-గంభీర్ లు ఇలా కలిసిపోవడం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli and Gautam Gambhir hugged each other.
A beautiful picture! pic.twitter.com/H8BVe9YgHC
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2023