మాజీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు మొదటి నుంచే ఈ ఎన్నిక కోసం కాస్త దూకుడు పెంచాయి. ఇక ముందస్తుగానే రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ గట్టి నమ్మకంతో బీజేపీ పార్టీలోకి చేరిపోయారు. దీంతో ఈటెల గెలుపును ఎవరూ ఆపలేరని బీజేపీ వర్గం నేతలు జోస్యం చెబుతున్నారు. ఇక ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు సీఎం కేసీఆర్.
ఎలాగైన ఇక్కడ గెలావాల్సిందేనని కంకణం కట్టుకుని తెర వెనుక మంతనాలు జరుపుతున్నారు. ఇక ఏకంగా హుజురాబాద్ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు అన్ని పార్టీలు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి ఈటెల ఉండగా కాంగ్రెస్ నుంచి ఓ బలమైన నేతను బరిలోకి దించేందుకు టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా అదే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నాడు.
దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్ధిని పేరు ఖరారు చేసేందుకు సీఎం ఎన్నో రోజుల నుంచి కసరత్తులు చేస్తూ వస్తున్నారు. కాగా నేడు ఎట్టకేలకు హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధి పేరు ఖారారు చేసింది పార్టీ అదిష్ఠానం. టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఫైనల్ చేసింది. ఇక గెల్లు శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన వాడిగా తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పూర్తి చేశాడు. దీంతో పాటు తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నట్లు కూడా గుర్తింపు ఉంది. మరి సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు గెలుపు టీఆర్ఎస్ వైపు నిలుస్తుందో లేదో చూడాలి మరి.