BRS: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మారింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్రీయ సమితి(BRS)గా మార్చారు. బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి 282 మంది పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై తీర్మానం జరిగింది. మధ్యాహ్నం 1.19 నిమిషాలకు పేరు మార్పు చేయాలని సభ్యులు తీర్మానాన్ని ఆమోదించారు. సరిగ్గా 1.19 నిమిషాలకు టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్గా మార్చబడింది.