మాజీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కొడుకు నసీర్ అహ్మద్. పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. కామంతో ఆగక మనోడు పరాయి స్త్రీలపై కన్నేస్తూ ఉండేవాడు. అందమైన అమ్మాయిలు కనిపించారా ఇక అంతే. కామంతో కళ్లు మూసుకుపోయి పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కొడుకై ఉండి ఇలాంటి వికృతి చేష్టలకు కాలుదువ్వుతున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులోని నివాసముంటున్నాడు నజీర్ మహ్మద్ అనే వ్యక్తి. చెడు అలవాట్లకు బానిపై పాడు చేష్టలకు సై అంటున్నాడు.
తాజాగా ఇలాంటి పాడు పనికి పథకం రచించాడు నసీర్. అతను ఉంటున్న ఫ్లాట్‌లోనే మేడపై ఓ కుటుంబం కిరాయికి ఉంటున్నారు. కాగా ఆ ఫ్లాట్ ఓనర్ మేడపై మరో ఇల్లు ఖాళీగా ఉందని ఎవరికైనా కిరాయికి ఇవ్వాలని సూచించి ఆ ఇంటి తాళం ఇచ్చి వెళ్లారు. దీన్నే అదునుగా చేసుకున్న నసీర్ కిరాయి కోసం వస్తున్నవాళ్లకి ఇల్లు చూపించి పక్క ఇంట్లో ఉన్న వివాహిత, ఆమె కూతురుపై కన్నేశాడు. దీంతో ప్రతీరోజు మేడపైకి వెళ్లటం, వాళ్లు అందంగా ఉన్నారని భావించి వారితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.
ఇక ఒక రోజు అంతటితో ఆగకుండా వాళ్లకు తెలియకుండా ఏకంగా ఆ వివాహిత, కూతురు స్నానం చేసే బాత్ రూంలోకి ఓ లేజర్ కెమెరాను అమర్చాడు. ఈ క్రమంలో ఆ వివాహిత, ఆమె కూతురు స్నానం చేసేది చూస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. ఇక ఒక రోజు గమనించిన ఆ వివాహిత పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.