LPG గ్యాస్ సిలిండర్ సబ్సీడి ధరపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తాజాగా రాజ్యసభలో మాట్లాడుతూ సబ్సీడి ధర భారీగా పెంచడంతో పాటు LPG గ్యాస్ సిలిండర్ బరువును కూడా తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపాడు.
మరీ ముఖ్యంగా 14.2 కిలోల ఉన్న బరువున్న గ్యాస్ సిలిండర్ తగ్గించాలని, బరువు అధికంగా ఉండడంతో మహిళలు వంటింట్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీంతో వెంటనే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభలో ఓ సభ్యుడు ప్రభుత్వానికి సూచించాడు.
ఇక దీనిపై స్పందించిన మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. LPG గ్యాస్ సిలిండర్ బరువుతో పాటు LPG గ్యాస్ సిలిండర్ సబ్సీడి ధరను కూడ పెంచే దిశగా ప్రభుత్వం ఉన్నట్లు తెలిపాడు. ఇక ఇటీవల ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ పై ఏకంగా రూ.103.50కు పెంచడంతో హైదరాబాద్ లో మార్కెట్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2278కి చేరటం విశేషం. అయితే కేంద్ర ప్రభుత్వం LPG గ్యాస్ సిలిండర్ బరువును, సబ్సీడి ధరను పెంచే ఆలోచనలు ఉండడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.