ఈ మద్య సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ప్రపంచంలోని ఎక్కడా చూడని వింతలు, విశేషాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఇలాంటి వీడియోలు కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా వింత ఆకారాల్లో జన్మించిన జంతువుల వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఓ మేక మనిషి లాంటి వింత జీవికి జన్మనిచ్చి గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఇది కూడా చదవండి: ఐదేళ్ల చిన్నారికి అంతులేని కష్టం
వివరాల్లోకి వెళితే.. అసోం రాష్ట్రం కాచర్ జిల్లాలోని గంగాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకను పెంచుకుంటున్నాడు. ఆ మేక ఓ వింత జీవికి జన్మనిచ్చింది. ఆ జీవి అచ్చం మనిషిలా ఆకారాన్ని పోలి ఉంది. తల భాగం మొత్తం మనిషి ఆకారాన్ని పోలి ఉండగా.. కింది భాగం మొత్తం అభివృద్ధి చెందలేదు. రెండు కాళ్లు, చెవులు మినహా మొత్తం శరీరం మానవ పిల్లల మాదిరిగానే ఉందని అంటున్నారు. ఆ వింత జీవి పుట్టిన అరగంటకే మరణించింది. ఆ మేక యజమాని మాట్లాడుతూ.. సోమవారం తన మేకకు మానవ శరీరంలాంటి బిడ్డ పుట్టడం చూసి షాక్ అయ్యానని చెప్పాడు. ముఖం మొత్తం శిశువులా ఉంది మరియు శిశువుకు తోక లేదని తెలిపాడు.