హర్షసాయి.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకి ఈ పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ కుర్రాడు.. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ కష్టాల్లో ఉన్నవారు, నిరుపేదలను గుర్తిస్తూ వారి కలలను నెరవేరుస్తుంటాడు. ఫ్రీ పెట్రోల్ బంక్ కాన్సెప్ట్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు హర్షసాయి మరో విభిన్న కాన్సెప్ట్ తో ముందుకొచ్చాడు. అదేంటంటే నిరు పేదలకు 5 స్టార్ హోటల్ లో భోజనం రుచి చూపించడం. అలా హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ మొదలు కర్ణాటక, కేరళ, నార్త్ ఇండియా ఇలా మొత్తం దేశంలోని ప్రముఖ నగరాల్లో పేదవాళ్లకు 5 స్టార్ హోటల్ ఆతిథ్యాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. హర్ష సాయి చేసిన ఈ ఫ్రీ 5 స్టార్ హోటల్ కాన్సెప్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.