ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నేతలు ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల ప్రచారాల్లో పలు అపశృతులు జరుగుతున్న విషయం తెలిసిందే.
కర్ణాటకలో ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ముఖ్య నేతలు ముమ్మర ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో నేతలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డికె శివకుమార్ హెలికాప్టర్ ని పక్షి ఢీ కొట్టడింతో ముందు భాగం ధ్వంసం కావడంతో పైలెట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. అదేరోజు ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ హెలికాప్టర్ బురుదలో కూరుకు పోవడంతో వందమంది సిబ్బందితో ఎలాగో అలా బయటకు తీశారు. తాజాగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్ కి మరోసారి పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్ కి అస్సలు అచ్చిరావడం లేదనిపిస్తుంది. మొన్నటికి మొన్న హెలికాప్టర్ ని పక్షి ఢీ కొట్టడంతో పైలెట్ చాకచాక్యంగా వ్యవహరించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా డీకే శివకుమార్ మరోసారి తృటిలో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండైన కొద్దిసేపటికే హెలిప్యాడ్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన హున్నవర్ లోని రామతీర్థం వద్ద జరిగింది. విషయం తెలిసిన కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారే ఉలిక్కిపడ్డారు. కాకపోతే డీకే శివకుమార్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.