మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. సోమవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. దీంతో పాటు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తో పాటు వీఐపీలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆలయ దర్శనానికి సందర్శకుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురికి గాయాలైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి తో పాటు కొందరు వీఐపీలు దేవుడి దర్శనాన్ని చేసుకున్నారు.అనంతరం తిరిగి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలోనే కరోనా నిబంధనలకు నీళ్లొదిలిన భక్తులు ఇష్టప్రకారం ముందుకు కదిలారు. ఇక్కడే ఒక్కసారిగా అల్లరి చేస్తూ బారికేడ్లు తోసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఒకవైపు ఒకరినొకరు చేయి చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. భద్రత సిబ్బందిని కాదని తోసుకెళ్ళటంతో వారిని కంట్రోల్ చేయలేకపోయారు. ఇక తాజాగా ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో కొంత మంది ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తీరుపై కూడా విమర్శలు ఎక్కిపెడుతున్నారు. కనీస అవగాహన లేకుండా భక్తులు ఉన్న చోట అధిక సంఖ్యలో భద్రాత సిబ్బందిని ఉంచాల్సింది పోయి ఇలా చేయటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.