మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. సోమవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. దీంతో పాటు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తో పాటు వీఐపీలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆలయ దర్శనానికి సందర్శకుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురికి గాయాలైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి తో పాటు కొందరు వీఐపీలు దేవుడి దర్శనాన్ని చేసుకున్నారు.అనంతరం తిరిగి వెళ్లిపోయారు. […]