ఓ ఏనుగు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తోంది. కనిపించిన వారినల్లా చంపుకుంటూ పోతోంది. ఎప్పుడు..? ఏ గ్రామ మీద దాడి చేస్తుందో తెలియక ఐదు జిల్లాలోని ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఏనుగు కంటికి కనపడ్డారా..! ప్రాణాలతో వదలట్లేదని వాపోతున్నారు. కింద పడేసి కాలితో తొక్కి చంపుతున్నట్లుగా చెప్తున్నారు.
ఏనుగు కనపడగానే ‘ఏనుగు నల్లనా.. ఏనుగు కొమ్ములు తెల్లనా..’ అని పాటలు పాడుకునే రోజులు పోయాయి. ఈ పేరు వినబడితే చాలు ఆగకుండా అర కిలోమీటర్ దూరం పరిగెత్తే రోజులొచ్చాయి. పిచ్చెక్కిన ఓ ఏనుగు ధాటికి జార్ఖండ్‌లోని అయిదు జిల్లాల్లోని గ్రామస్థులు ఈ విధంగానే పరుగులు పెడుతున్నారు. దీని ధాటికి అధికారులు గ్రామాలలో 144 సెక్షన్ విధించారంటే అర్థం చేసుకోవాలి.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో. ఇప్పటికే ఈ ఏనుగు 12 రోజుల్లో 16 మందిని పొట్టన పెట్టుకుంది.
జార్ఖండ్‌లో ఓ ఏనుగు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తోంది. కనిపించిన వారినల్లా చంపుకుంటూ పోతోంది. ఇప్పటికే ఈ ఏనుగు గత 12 రోజుల్లో 16 మందిని బలితీసుకుంది. ఒక్క రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది. దీంతో ఇటకీ బ్లాక్ లో ఐదుగురికి మించి జనం గుమికూడదంటూ అధికారులు 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగుకు దగ్గరగా వెళ్లవద్దని సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే.. ఏనుగు దాడిలో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
16 people have been killed by an #elephant in 5 #Jharkhand districts in the past 12 days. Notably, the jumbo allegedly killed 4 persons in a single block of Ranchi district.
The deaths were reported from Hazaribagh, Ramgarh, Chatra, Lohardaga and #Ranchi districts pic.twitter.com/oYw86cljP0
— Mirror Now (@MirrorNow) February 21, 2023
ముఖ్యంగా హజారీబాగ్, రామ్ గడ్, చతరా, లోహర్ దగా, రాంచీ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువుగా ఉంటోంది. ఎప్పుడు..? ఏ గ్రామ మీద దాడి చేస్తుందో తెలియక ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. దీనిని అడవిలోకి తరలించేందుకు పశ్చిమ బెంగాల్ లోని బాంకుడా జిల్లా నుండి నిపుణులను రప్పిస్తున్నారు. అయితే, ఇంతమందిని మందిని ఏనుగే చంపిందా..? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని విచారిస్తున్నట్లు ప్రిన్పిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) శశికర్ సమంత తెలిపారు. కాగా, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2017 నుంచి గత ఐదేళ్లలో ఏనుగుల బారినపడి 462 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
An Elephant killed four persons in Lohardaga of Jharkhand. All the deceased belong to the same village but are from different families. An elephant entered the village from the local forest in the morning. The tusker was safely escorted towards the forest.#elephants pic.twitter.com/Hgql7vPPpQ
— The Summer News (@TheSummerNews2) February 22, 2023