దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు వేగవంత చేయడంతో కరోనా సోకే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళన సృష్టిస్తున్న విషయం తెలిసిందే. యూరోపియన్ దేశాల్లో రోజుకు 40 వేల కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్నా ఇండియాలో రోజుకు 10 వేల కన్నా తక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 6,984 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో నిన్న 8,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే, 247 మరణాలు సంభవించాయి. ఒక్క కేరళలో నమోదైన కరోనా కేసులే 3,377 ఉన్నాయని వివరించింది. నిన్న కేరళలో నిన్న 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నిన్న 8,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే, 247 మరణాలు సంభవించాయి. దేశంలో 87,562 మంది ఆసుపత్రులు, హోంక్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నుంచి ఇప్పటివరకు 3,41,46,931 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 4,76,135గా నమోదయింది. దేశంలో మొత్తం 1,34,61,14,483 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/aGiINxBIqT pic.twitter.com/fWoVS2tPRo
— Ministry of Health (@MoHFW_INDIA) December 15, 2021