కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో రోజురోజుకీ కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి.
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పరిస్థితులు చక్కబడి, సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఈ వైరస్ మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. సోషల్ డిస్టెన్సింగ్, వ్యాక్సినేషన్ వల్ల పీడవిరగడైందని అనుకుంటే.. మాయావి మహమ్మారి మళ్లీ దాపురించింది. భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ బారిన పడకుండా ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు వేసుకోవడం లాంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని నోయిడా అధికార యంత్రాంగం సూచనలు చేసింది. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కు వేసుకోవాలని స్పష్టం చేసింది.
పని ప్రదేశాల్లో యాజమాన్యాలు కొవిడ్ నివారణ చర్యలు చేపట్టాలని ఆఫీసర్స్ తెలిపారు. కార్యాలయాలను శానిటైజర్లతో శుభ్రం చేయాలని, ఆఫీస్ ఎంట్రెన్స్‌ల వద్ద థర్మల్ టెంపరేచర్ స్కానర్లను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. అలాగే ఆఫీస్ ఉద్యోగుల్లో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే వారికి వెంటనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ లక్షణాలు తగ్గకపోతే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆ ఎంప్లాయీస్‌కు సూచించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానికి పక్కనే ఉన్న గౌతమ్ బుద్ధ నగర్ సహా యూపీలోని ఇతర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నోయిడా అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టి ప్రజల్ని ముందుగా అప్రమత్తం చేస్తున్నారు.
#Covid guidelines issued by #Noida health department: Wear masks, take WFH if sickhttps://t.co/rLaw15cb5W
— DNA (@dna) April 13, 2023